ఏపీకి వచ్చే వారంలో సూపర్ సైక్లోన్ ముప్పు.. ముందే జాగ్రత్త పడాలని ప్రభుత్వానికి చంద్రబాబు సూచన

TDP Chief Chandrababu Advises Govt to Take Action in Advance on Super Cyclone Threat to AP Next Week, Govt to Take Action in Advance on Super Cyclone Threat to AP Next Week, Super Cyclone Threat to AP Next Week, AP Super Cyclone Threat, TDP Chief Chandrababu Advises AP Govt, Nara Chandrababu Naidu, TDP Chief Chandrababu, Super Cyclone Threat, AP, AP Super Cyclone Threat News, AP Super Cyclone Threat Latest News And Updates, AP Super Cyclone Threat Live Updates, Mango News, Mango News Telugu

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. వచ్చే వారం ఆంధ్రప్రదేశ్‌కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఈ నేపథ్యంలో ముందే జాగ్రత్త పడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలను నీటముంచి ఆ తర్వాత ప్రభుత్వం హడావుడి చేయడం కాదని, ప్రజలను వరదలకు వదిలేయకుండా.. ముందుగానే క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక దీనిపై ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, లేదంటే వారు ఇక్కట్లకు గురవుతారని చంద్రబాబు తెలిపారు.

గతంలో ఆర్టీజీఎస్‌ వ్యవస్థ ద్వారా విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సహజ అలసత్వాన్ని వీడి విపత్తు నష్టాలను, కష్టాలను తగ్గించడానికి సిద్ధమవ్వాలని సూచించారు. ఈ మూడున్నరేళ్లలో రాయలసీమలో వరదలకు, గోదావరి నదీ వరదలకు ప్రభుత్వం ఎంత అలసత్వంగా ఉందో అంతా చూశామని అన్నారు. విపత్తుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ, విపత్తు తర్వాత బాధితులకు సాయం అందించడంలోనూ ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు శాపంగా మారుతుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు, తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఈ సైక్లోన్ పై అవసరాన్ని బట్టి స్పందించాలని చంద్రబాబు నాయుడు కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − thirteen =