భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

TDP Chief Chandrababu Participated in Bhogi Festival Celebrations in Krishna District

భోగి పండుగ సందర్భంగా బుధవారం నాడు కృష్ణా జిల్లాలోని పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తెచ్చిన జీవోల కాపీలను చంద్రబాబు భోగిమంటలో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు కన్నీరు రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సూచించారు.

నేనేం తప్పుచేశానో తెలీదు, అదే తప్పైతే క్షమించండి: చంద్రబాబు

జగన్ మాటలు నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లేశారని, తానేం తప్పు చేసానో తనకు తెలీదని చంద్రబాబు అన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశానని, అదే తాను చేసిన తప్పైతే తనను క్షమించాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరన్నారు. రైతు కూలీలు చితికిపోయారని తెలిపారు. ప్రజావ్యతిరేకతపై నిర్ణయాలు మీద నిర్ణయాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. 7 వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారని ఆరోపించారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానని చెప్పారని అన్నారు.

ధాన్యం కొనుగోళ్లు బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర ఉండటంతో పాటు మార్కెట్ కమిటీలు కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. మీటర్లు వ్యవసాయ మోటర్లకు కాదు మంత్రులకు పెట్టాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారన్నారు. లక్షా 30వేల కోట్ల అప్పు, 70వేల కోట్ల పన్నులు మోపారని తెలిపారు. ప్రతి ఒక్కరిపై ఇప్పటికే రూ.70 వేలు భారం మోపారన్నారు. కుటుంబంలో నలుగురు ఉంటే రూ.2.80 లక్షల భారం పడిందని, ఈ భారం జీవితాంతం మోస్తూ ఊడిగం చేసే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − five =