అప్పుడు మిత్రులు.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్దులు

Babu vs Karanam ,A war between old friends,political rivals,TDP Chief Chandrababu, Cheera MLA Karanam Balram, TDP, YCP, Congress, Jana Sena, BJP, Pawan Kalyan, Lokesh, Jagan,Mango News Telugu,Mango News
Babu vs Karanam ,A war between old friends,political rivals,TDP Chief Chandrababu, Cheera MLA Karanam Balram, TDP, YCP, Congress, Jana Sena, BJP, Pawan Kalyan, Lokesh, Jagan

టీడీపీ అధినేత చంద్రబాబు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇద్దరూ  ఒకప్పుడు మిత్రులు…  కానీ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్దులుగా మారడంతో వారిద్దరి మధ్య  మాటల యుద్దం మొదలైంది. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన రా.. కదలిరా.. బహిరంగ సభలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంను  చంద్రబాబు టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు పొలిటికల్ సర్కిల్ లో వేడిని రాజేశాయి. కరణం బలరాంను 2019 వరకు టీడీపీ గెలిపించిందని గుర్తు చేసిన చంద్రబాబు..  చీరాలలో బలరాంను పార్టీ గెలిపిస్తే, టీడీపీ కష్టకాలంలో ఉంటే వైసీపీ వైపు వెళ్లిపోయారని ఘాటు విమర్శలు చేశారు.

ఇప్పుడు మళ్లీ  తనను మరోసారి గెలిపించాలని ఇక్కడ  టీడీపీ నేతలను కోరుతున్నారని, అతనిని గెలిపిస్తే తిరిగి టీడీపీలోకి వస్తానంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మనేమేమన్నా అమాయకులమా.. తమ్ముళ్లూ అంటూ కరణం బలరాంకు చంద్రబాబుకు  చురకలు అంటించారు. మోసం చేసిన అలాంటి వాళ్లకు బుద్ది చెప్పాలని.. వచ్చే ఎన్నికల్లో కరణం బలరాంను ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై  కరణం బలరాం కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఇంకొల్లు సభలో తననొక దుర్మార్గుడుగా అభివర్ణించారని, తనపై అవాకులు, చవాకులు పేలడం వల్లే ఇప్పుడు తాను కూడా మట్లాడాల్సి వస్తుందని అన్నారు.

చంద్రబాబు నాయుడు కన్నా దుర్మార్గున్ని ఇంతవరకు చూడలేదని  కరణం బలరాం చెప్పుకొచ్చారు. చంద్రబాబు చరిత్ర ఏందో..తన చరిత్ర ఏంటో తేల్చుకుందాం రమ్మంటూ సవాల్‌ విసిరారు. 1970 నుంచి ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసునని బలరాం కౌంటర్ ఇచ్చారు. 2019లో తాను చీరాలకు పోతానని అడగలేదని..చీరాలలో ప్రజలు తనను పార్టీలతో సంబంధం లేకుండా గెలిపించారని గుర్తు చేశారు. చీరాలలో తనను గెలిపించానని బాబు చెబుతున్నారని..ఆయనకు అంత సత్తా ఉంటే  కొడుకు లోకేష్‌ను మంగళగిరిలో ఎందుకు గెలిపించుకోలేకపోయారని ప్రశ్నించారు.

2014లో 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారని..ఇలాంటి చర్యలను అప్పుడే ఖండించామని  కరణం బలరాం అన్నారు. పార్టీని మోసం చేసి వెళ్లిపోలేదని, మరోసారి బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని కరణం హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన  నాయకులను ఎంతగా చిత్రహింసలు పెట్టింది తనకు తెలుసన్నారు. పరిటాల రవి, కోడెల శివప్రసాద్ విషయంలో ఇబ్బందులు పెట్టారని..వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం  పరామర్శించలేదని గుర్తు చేశారు. తాను టీడీపీ టికెట్ అడిగానని నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు కరణం. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు కూతలు కూస్తే బాగుండదని హెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =