మునుగోడు అంటే కాంగ్రెస్ బ్రాండ్, ఇక్కడ కాంగ్రెస్‌ జెండా ఎగురుతుంది.. చండూరు బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

TPCC President Revanth Reddy Slams Komatireddy Rajagopal Reddy Politics in Chandur Public Meeting, TPCC Chief Revanth Reddy Slams Komatireddy Rajagopal Reddy Politics in Chandur Public Meeting, Revanth Reddy Slams Komatireddy Rajagopal Reddy Politics in Chandur Public Meeting, TPCC Chief Slams Komatireddy Rajagopal Reddy Politics in Chandur Public Meeting, TPCC President Revanth Reddy flays Rajagopal for ditching Congress, TPCC chief Revanth Reddy lashes out MLA Komatireddy Rajagopal Reddy, Munugode MLA Komatireddy Rajagopal Reddy, Komatireddy Rajagopal Reddy Politics, Chandur Public Meeting, TPCC President Revanth Reddy, MLA Komatireddy Rajagopal Reddy, Komatireddy Rajagopal Reddy, Revanth Reddy, Chandur Public Meeting News, Chandur Public Meeting Latest News, Chandur Public Meeting Latest Updates, Chandur Public Meeting Live Updates, Mango News, Mango News Telugu,

తాజాగా కాంగ్రెస్‌ పార్టీని వీడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని, తనకు అండగా నిలిచిన కార్యకర్తలను మరిచిపోయి మునుగోడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని విరుచుకుపడ్డారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి చండూరులో జరిగిన బహిరంగ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజకీయాలపై ఆయన మండిపడ్డారు. కాగా రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడినా.. కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతు ప్రకటించేందుకు, వారికి అండగా ఉన్నామని సంకేతాలు ఇచ్చేందుకు టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వెన్నుపోట్లను, కప్పదాట్లను సహించడు మునుగోడు కాంగ్రెస్ కార్యకర్త. జోరువానను లెక్క చేయక.. శ్రీమతి సోనియాగాంధీని వెన్నుపోటు పొడిచిన వాడి విశ్వాసఘాతుకానికి సరైన జవాబు చెప్పేందుకు తరలివచ్చిన కాంగ్రెస్ కడలి ఇది అని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, ధర్మ బిక్షం, రావి నారాయణరెడ్డి, చకిలం శ్రీనివాసరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తమ సిద్ధాంతాలకు, చివరి శ్వాస వరకు ప్రాతినిధ్యం వహించిన పార్టీలకు కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. అలాగే నల్గొండ జిల్లా అభివృద్ధికి మాదవరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరుల కృషిని గుర్తు రేవంత్‌రెడ్డి చేసుకున్నారు.

సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలపై ఈడీ పెట్టిన కేసులు రాజకీయ వేధింపుల్లో భాగమేనని, తల్లి లాంటి సోనియాగాంధీని బీజేపీ నేతలు మోదీ, అమిత్‌షాలు వేధిస్తుంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడి నమ్మకద్రోహం చేశారని రేవంత్‌ దునుమాడారు. 2018 ఎన్నికల్లో పొత్తులు, రాజకీయ సమీకరణాల కారణంగా పాల్వాయి స్రవంతికి 2014లో పార్టీ టిక్కెట్ రాకపోయినప్పటికీ, నిబద్ధతతో కూడిన కాంగ్రెస్ కార్యకర్తగా రాజగోపాల్ రెడ్డి గెలుపునకు తనవంతు సహకారాన్ని అందించారని తెలిపారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల కలను సాకారం చేశారని ఆయన పునరుద్ఘాటించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అఖండ విజయాన్ని అందించి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేయాలని రేవంత్‌రెడ్డి మునుగోడు ప్రజలకు పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =