విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి – టీడీపీ నేత బొండా ఉమ డిమాండ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల పునర్విభజన ప్రకటన తర్వాత జిల్లాల ప్రాంతాలు, పేర్లు మొదలగు విషయాల్లో రోజుకొక వివాదం రేగుతోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల పేర్ల విషయంలో ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. విజయవాడ ను రెండు జిల్లాలుగా విభజిస్తున్న నేపథ్యంలో.. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని.. అదేవిధంగా మరొక జిల్లాకు స్థానికంగా మహానేతగా పేరున్న వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ నేత బొండా ఉమ డిమాండ్ చేశారు. ఈక్రమంలో విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ రేపు (బుధవారం) ఉదయం ధర్నా చౌక్ వద్ద వేలాది మందితో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు ఉమ. మా డిమాండ్ నెరవేర్చని పక్షంలో ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా ముట్టడిస్తామని బొండా ఉమ హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో వంగవీటి రంగా గారి విగ్రహం ఉంటుందని ఉమా తెలిపారు. వంగవీటి రంగా పేదల కోసం నిరాహార దీక్ష చేస్తూ.. ప్రాణాలు అర్పించారని గుర్తు చేసుకున్నారు బొండా ఉమ. అందుకే అలాంటి మహానేత పేరు పెట్టకుంటే సీఎం జగన్​ చరిత్ర హీనులవుతారన్నారు. వంగవీటి రంగా.. ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క కుటుంబానికో చెందిన వ్యక్తి కాదని, ఈ సందర్భంగా బొండా ఉమ చెప్పారు. తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు రంగా పేరు పెట్టాలని 10 రోజుల నుంచి అడుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. అయితే, రేపు చేపట్టబోయే దీక్షకు వంగవీటి రాధను ఆహ్వానించాలని అనుకున్నామని, కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + ten =