ఐపీఎల్‌-2022 ఆటగాళ్ల మెగావేలం ప్రక్రియ తేదీలు, సమయం ఖరారు, ఎప్పుడంటే?

IPL, IPL 2022, IPL 2022 Date and timings of mega-auction revealed, IPL 2022 mega auction, IPL 2022 Mega Auction News, IPL Auction 2022, IPL Auction 2022 Date and time, IPL Auction 2022 Date Time Announced, IPL Player Auction, IPL Player Auction 2022, IPL Player Auction 2022 Dates, IPL Player Auction 2022 Dates and Time Announced, Mango News, Mango News Telugu

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ తేదీలను మరియు సమయం షెడ్యూల్ ను మంగళవారం నాడు ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో మెగా వేలం జరగనున్నట్టు తెలిపారు. ఆ రెండు రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని, స్టార్ స్పోర్ట్స్ ఇండియా నెట్‌వర్క్‌, డిస్నిప్లస్ హాట్ స్టార్ లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని చెప్పారు. ఇక ఐపీఎల్ తో వివో ఒప్పందం ముగియడంతో టాటా గ్రూప్ ఐపీఎల్ అధికారిక స్పాన్సర్ షిప్ ను దక్కించుకుంది. దీంతో ఈ 15వ సీజన్/ఐపీఎల్-2022 ఇకపై టాటా ఐపీఎల్-2022గా పిలువబడనుంది.

మరోవైపు ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా 1,214 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే కొత్తగా చేరిన అహ్మదాబాద్ ప్రాంచైజీ, లక్నో సూపర్ జెయింట్స్ సహా 10 ఫ్రాంచైజీలు కూడా తమ ఆటగాళ్ల రిటెన్షన్/ఎంపిక జాబితాను సమర్పించడంతో, వేలంలో ఉండే 590 మంది క్రికెటర్లతో కూడిన తుది జాబితాను బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది. మొత్తం 590 మంది క్రికెటర్లలో 370 మంది భారత్, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ళలో 228 మంది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళు కాగా (క్యాప్‌డ్‌ ప్లేయర్లు), 355 మంది ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు (అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లు) మరియు 7 మంది అసోసియేట్‌ దేశాల క్రికెటర్లు ఉన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =