ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం

AP CM YS Jagan, AP Government Passes New Bill In Assembly, AP Govt Appoints Commission To Monitor Private Schools, AP Govt Bills, AP Govt New Bills, Ap Political News, AP Politics, Mango News Telugu, Monitoring Commission Bill, Monitoring Commission Bill 2019, RTE Act, School Education Regulatory, School Education Regulatory and Monitoring Commission Bill, School Education Regulatory Bill 2019, TDP, YCP Government, YSRCP

జూలై 29న,అసెంబ్లీ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ బిల్లు 2019 ను ఆమోదించింది. దీని ప్రకారం పాఠశాలల ప్రమాణాలను నిర్వహించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసారు. ఫీజు నియంత్రణ, ఉపాధ్యాయుల నైపుణ్యాలు, సమాచార బహిర్గతం, సమర్థవంతమైన తనిఖీ, పాఠశాలల పర్యవేక్షణ మరియు విద్యాహక్కు (ఆర్‌టిఇ) చట్టంలోని నిబంధనల అమలు వంటి అంశాలను కూడా కమిషన్ చూసుకుంటుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఈ కమిషన్ కు చైర్మన్ గా వ్యవరిస్తారు. చైర్మన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు, అంతే గాక 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిషన్ ఫీజులు, పాఠశాలల గ్రేడింగ్, ఆర్టీఈ చట్టం అమలు, మరియు విద్యా సంస్థల పర్యవేక్షణ, సిబ్బంది మరియు ఇతర విషయాలను పరిశీలిస్తుంది. ఏ పాఠశాలకైనా వెళ్లి తనిఖీ చేసే అధికారం ఈ కమిషన్ కు ఉంది, మరియు ఏదైనా పాఠశాల కొత్త బిల్లు కింద నిబంధనలను పాటించటానికి నిరాకరిస్తే, కమిషన్ పాఠశాలను మూసివేయవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కొత్త బిల్లును చారిత్రాత్మక మరియు విప్లవాత్మకమైనదిగా పేర్కొన్నారు. ఫీజును నియంత్రించడంలో, కార్పొరేట్ పాఠశాలలను నియంత్రించడంలో గత ప్రభుత్వ అసమర్థత, వైఫల్యంపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ దోపిడీ గురించి మాకు తెలుసు, విద్యాసంస్థల యజమానులే మంత్రులుగా ఉంటే, వాళ్ళు పాఠశాలలు, ఫీజులను ఎలా నియంత్రిస్తారు, విద్యావ్యవస్థను సమూలంగా మార్చే చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొస్తున్నాం అని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల ద్వారా లాభాలు ఆర్జించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నిర్మాణాన్ని నాశనం చేశారని టీడీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి విమర్శించారు. ఆర్టీఈ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25% సీట్లను ఉచితంగా అందించాలని ప్రైవేటు పాఠశాలల యజమానులను ఆదేశించారు. స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ బిల్లు 2019, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోదం పొందిన తరువాత అమలు చేయబడుతుంది.

 

[subscribe]
[youtube_video videoid=qeRGC5AZma0]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − four =