హిందూపురంలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

TDP MLA Nandamuri Balakrishna Launches Free NTR Arogya Ratham For People in Hindupur Today, Balakrishna Launches NTR Aarogya In Hindupur Mandal, Balakrishna launched a special bus called NTR Arogya Ratham for mobile medical services, Balakrishna Launches NTR Aarogya, TDP MLA Nandamuri Balakrishna, NTR Arogya Ratham, mobile medical services, Hindupur MLA Balakrishna, MLA Balakrishna, NTR Arogya Ratham News, NTR Arogya Ratham Latest News And Updates, NTR Arogya Ratham Live Updates, Mango News, Mango News Telugu,

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉచిత వైద్య సేవలందించేందుకు గాను ఉచిత ఎన్టీఆర్‌ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. బుధవారం ఆయన, సతీమణి వసుంధరతో కలిసి వాహనానికి పూజ చేసిన అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. దీని ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తామని, రక్త పరీక్షలు మొదలుకుని అన్నిరకాల వైద్య చికిత్సలు అందించటానికి ఈ వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని, ఇది కేవలం ఆరంభమేనని, ఇలాంటి ఉచిత ఆరోగ్య రథాలను మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని బాలకృష్ణ అన్నారు.

హిందూపురం ఆసుపత్రిలో కరోనా విపత్కర కాలంలో 30 వెంటిలేటర్లను అందిస్తే, వాటిని వినియోగించకుండా మూలన పడేయడం బాధాకరమని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. గ్రామస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆరోగ్య రథం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇక ఈ వాహనంలో డాక్టర్, నర్సు, ఫార్మసిస్ట్, లేబొరేటరీ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారని, 200 వరకు వ్యాధులను గుర్తించి మందులతో సహా చికిత్స అందిస్తామని బాలకృష్ణ స్పష్టం చేశారు. కాగా డయాగ్నస్టిక్ సేవలతో మొబైల్ క్లినిక్‌గా మార్చడానికి వాహనం కోసం ₹40 లక్షలు వెచ్చించారు. ఈ వాహనంపై ‘ప్రతి ఇంటికి శుభమస్తు – మన హిందూపురం, మన బాలయ్య’ అనే స్లోగన్ ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here