ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Actor Hindupur TDP MLA Nandamuri Balakrishna Sensational Comments on NTR Health University Name Change,Nandamuri Balakrishna Comments On NTR Health University Name Change, NTR Health University Name Change, NTR Health University, Balakrishna On NTR Health University Name Change, NTR Health University, Dr YSR Health Varsity, TDP Chief Chandrababu Naidu, AP Govt Decision to Name Change of NTR Health University After YSR, Mango News, Mango News Telugu, AP Former CM YS Rajashekar Reddy, Former CM Nandamuri Taraka Rama Rao, YSR Congress Party, Telugu Desham Party, AP Assembly Session

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పేస్ బుక్ వేదికగా ప్రముఖ అగ్రనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరుకాదుని అన్నారు.

“మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరుకాదు. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచ భూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు. పీతలున్నారు. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్” అంటూ నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here