టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, AP COVID 19 Cases, COVID-19, COVID-19 Daily Bulletin, Mango News, Somireddy Chandra Mohan Reddy, Somireddy Chandra Mohan Reddy Tests Positive for Covid-19, TDP Senior Leader Somireddy Chandra Mohan Reddy, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, పలుపార్టీల నాయకులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో తాజాగా మరో నాయకుడికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను. హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీలో జనవరి 5 నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,587 కు చేరుకుంది. వీరిలో 8,73,427 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 3038 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − six =