అభ్యర్థుల ఎంపికలో టీడీపీ నయా స్ట్రాటజీ

New strategy of TDP in selection of candidates,New strategy of TDP in selection,TDP in selection of candidates,Chandrababu naidu, Telugu desam party, AP Politics, AP Assembly elections,Mango News,Mango News Telugu,TDP New strategy,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,TDP Chief Chandrababu Naidu Latest News,TDP Chief Chandrababu Naidu Latest Updates
Chandrababu naidu, Telugu desam party, AP Politics, AP Assembly elections

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి భగ్గుమంటోంది. ఎన్నికలకు ఇంకా సమయమున్నప్పటికీ.. ఇప్పటి నుంచే నేతలు రచ్చ చేస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిమగ్నమైపోయాయి. అయితే ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో కొత్త పద్ధతిని అనుసరిస్తున్నట్లు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆశావాహులకు సంబంధించి వారి చరిత్ర, ప్రజాభిప్రాయం సేకరించి.. పరిశీలించిన తర్వాతే అభ్యర్థులను ఖరారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదంతా అభ్యర్థులకు తెలియకుండా.. రహస్యంగా చేస్తామని చెప్పారు.

త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల గెలుపు ముఖ్యం కాదన్న చంద్రబాబు.. రాష్ట్రం గెలవాలన్నదే తమ కొత్త నినాదమని చెప్పుకొచ్చారు. వైసీపీ ఓడిపోతేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు. సీఎం జగన్‌లో ఓటమి భయం రోజురోజుకు పెరిగిపోతోందని.. అందుకే 11 మందిని మార్చేశారని విమర్శించారు. జగన్ 150 మందిని మార్చినా కూడా ఈసారి వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. అన్ని విషయాల్లో జగన్ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు.  ప్రజలంతా జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఇకపోతే జనసేనతో కలిసి తెలుగు దేశం పార్టీ ఈసారి ఎన్నికలకు వెళ్తోన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు వెళ్లి రాజమండ్రి సెంట్రలు జైలు ఎదుటే పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. ఈక్రమంలో జనసేనకు కేటాయించబోయే స్థానాలపై జాగ్రత్తగా కసరత్తు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. జనసేన తరుపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని కోణాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =