సీఎం జగన్‌ను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు.. జీపీఎస్‌ సహా పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు

AP Employees Union Leaders Meets CM Jagan And Thanks Him For Announcing GPS Regularization Of Contract Employees,AP Employees Union Leaders Meets CM Jagan,AP Employees Union Thanks Him For Announcing GPS Regularization,GPS Regularization Of Contract Employees,Mango News,Mango News Telugu,AP Employees Union Leaders,AP Employees Union Leaders Thanks CM Jagan,AP Contract Employees Salute To CM Jagan,AP Contract Employees Reaction,AP Govt Shock To Employees Union,AP NGO Bandi Srinivas Says Thanks,AP Employees Union Leaders Latest News,AP GPS Regularization News Today,AP GPS Regularization Latest News,AP GPS Regularization Latest Updates,AP GPS Regularization Live News,AP Contract Employees,AP Contract Employees Live News And Updates

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు పలువురు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైజేషన్‌, జీపీఎస్‌ ప్రకటన సహా ఉద్యోగుల విషయలో కేబినెట్‌ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై సీఎం జగన్‌కు ఉద్యోగుల సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ప్రభుత్వం ఎల్లవేళలా మేలు చేస్తుందని, తాము ప్రభుత్వ భాగస్వాములమని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న ముఖ్యమంత్రి, రెండేళ్లుగా పెన్షన్‌తో పాటు కొన్ని పరిష్కారాల కోసం కృషి చేస్తున్నామన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా వారి జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండేలా జీపీఎస్‌ను రూపొందించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 1 =