ఏకంగా 100 అడుగులు వెనక్కి వెళ్లిన సముద్రం..

The Visakha Sea that Went Back 100 Feet at Once, The Sea that Went Back 100 Feet at Once, The Visakha Sea that Went Back, Visakha Sea Went Back 100 Feet, Vizag Beach,Vizag,Visakha, Visakha Beach, Latest Visakha Sea News, Visakha Sea News 2024, Visakha Sea News Updates, Sea, Water, Vizag News, Mango News, Mango News Telugu
Vizag Beach,Vizag,Visakha, The sea that went back 100 feet at once, Visakha Beach

విశాఖపట్టణంలోని సముద్రం ఉన్నట్టుండి.. వెనక్కి వెళ్తుండటంతో విశాఖ వాసులను ఆందోళనకు గురవుతున్నారు. జపాన్‌లో భూకంపం ప్రభావమో, లేక  అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల ప్రభావమో కారణం ఏదయినా గానీ, విశాఖపట్నంలో మూడు, నాలుగు రోజులు నుంచి సముద్రం కాస్త వెనకకు వెళ్లడంతో  సముద్రంలో అలజడి రేగింది. దీనికి కారణం  జపాన్‌లో భూకంపమే  అనడంతో ఎక్కడో వచ్చిన ఇలాంటి ప్రకృతి విపత్తులతో సముద్రం  అంత దూరం వెళ్తుందా అన్న అనుమానాలు తలెత్తున్నాయి.

అవును తాజాగా సముద్ర తీరం నుంచి దాదాపు 100 అడుగుల వరకు సముద్రం వెనక్కి తగ్గింది. నాలుగు రోజులుగా ఇలాగే జరుగుతోందని మత్స్యకారులు,  స్థానికులు చెబుతున్నారు. దీంతో తీరానికి దగ్గర్లో ఉంటున్న జనం  కొంపదీసి సునామీ లాంటిది ఏమైనా వస్తుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనవరి 2న ఆర్కే బీచ్ దగ్గర దాదాపు 100 అడుగుల దూరం వరకూ సముద్రం వెనక్కివెళ్లింది. అలాగే జనవరి  4న కూడా కూడా సముద్రం వెనక్కివెళ్లింది. ఇలా  100 అడుగులు సముద్రం వెనక్కి వెళ్లడంతో లోపల ఉన్న చెత్తాచెదారం తీరానికి కొట్టుకొచ్చింది.

విశాఖలో ఉన్న యువత, మహిళలు, పిల్లలు పెద్దలు అందరూ.. సాయంత్రం అయితే చాలు కుటుంబాలతో సహా బీచ్‌లో కాసేపు గడపడానికి ఇష్టపడతారు. ఇక వీకెండ్స్, హాలీడేస్ లో అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.  అందుకే నిత్యం సముద్రాన్ని గమనించడం వల్ల ఏ చిన్ని మార్పు అయినా విశాఖవాసులు వెంటనే గుర్తిస్తారు.  సాధారణంగా ఆటు పోట్ల సమయంలో సముద్రం కొద్దిగా కాస్త వెనక్కి వెళ్లడం లేదంటే ముందుకు రావడం, సముద్రం ఎత్తు పెరగడం వంటి అనేక ఘటనలు వారు చూస్తుంటారు కానీ  ఈసారి ఈ స్థాయిలో వెనకకు వెళ్లడంతో సాగరతీరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు టూరిస్ట్ సీజన్ కావడంతో  పర్యాటకులు ఎక్కువ మంది బీచ్‌ను చూడటానికి వెళుతున్నారు. అయితే తాజగా సముద్రం నీరు వెనక్కి వెళ్లడంతో ..లోపల ఉండే  నున్నని సముద్రపు రాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఫోటోలు తీసుకోవడానికి సందర్శకులు పోటీలు పడుతున్నారు.

సముద్రం వెనక్కి పోవడానికి, జపాన్లో వచ్చిన భూకంపానికి సంబంధం ఉండకపోవచ్చని మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళికంగా అది సంభవం కాకపోవచ్చని అంటున్నారు. అయితే సముద్రం లోపల జరిగే అనేక రకాల పరిణామాలు..సాగర తీరాలపై ప్రభావం చూపిస్తాయని, అది సహజమైన ప్రక్రియే తప్ప వేరేది కాదని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + five =