రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్ ఏంటి?

What is the Big Task Ahead of Revanth Reddy, Big Task Revanth Reddy, Big Task Ahead, Telangana Congress, Parliament Election, Big Task Ahead of Revanth Reddy, Congress, Latest News Big Task Ahead of Revanth Reddy, Congress Latest News, Congress News Update, Telangana Elections, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Telangana Congress, Parliament election, big task ahead of Revanth Reddy, Congress

పార్లమెంట్ ఎన్నికలు  సమీపిస్తుండటంతో.. తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో..దూకుడు పెంచిన కాంగ్రెస్ .. ఎక్కువ స్థానాలను దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది.తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి..ప్రతీ విషయంలోనూ వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ అంతే వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వంపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఓ వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, మరోపక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవడం వంటి పెద్ద సమస్యలున్నా..వాటిని అధిగమించేందుకు రేవంత్ రెడ్డి తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటిసమయంలో రానున్న పార్లమెంటు ఎన్నికలు ..రేవంత్ రెడ్డి ముందు మరో సవాల్‌గా నిలిచింది.

పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీని విజయపథంలోకి తీసుకువెళ్లడంలో రేవంత్ రెడ్డి పాత్ర కీలకమైంది. ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్ వరకు కూడా ఆయనే  పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఒక వైపు పార్టీ అధ్యక్షుడుగా మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఎక్కువ సీట్లు సాధించడం  రేవంత్  ముందున్న బిగ్ టాస్క్ అయిన నిల్చుంది.

ఖమ్మం, వరంగల్, భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పెదపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకపక్షంగా గెలవడంతో.. ఇక్కడ పార్లమెంట్ స్థానాలను కూడా హస్తం పార్టీ గెలిచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఉత్తర తెలంగాణ జిల్లాలోని మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, కరీంనగర్, మెదక్,  ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్,   చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ  బలహీనంగా ఉండటంతో కాస్త కష్టపడితేనే ఇక్కడ కొన్ని స్థానాలు  అయినా గెలిచే అవకాశం కనిపిస్తోంది.

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండంతో  ఉత్తర తెలంగాణలో  కొంచెం కష్టపడితే గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలలో గట్టిగా పని చేస్తూ ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత  రేవంత్ రెడ్డి సీఎం హోదాలో దావోస్ పర్యటన వెళ్లనున్నారు. వచ్చిన తర్వాత  పార్లమెంట్ ఎన్నికల పైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నారు. 17 నియోజకవర్గాలలో  15 స్థానాలను అయినా గెలిచే విధంగా తన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే  పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ గట్టిగా  అన్వేషణ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు చేయించినట్టుగానే  పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొంతమంది పేర్లను సర్వే చేయిస్తూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్ కనుగోలు టీమ్ అసెంబ్లీ ఎన్నికలలో పనిచేసిన విధంగానే  పార్లమెంట్ ఎన్నికలలో కూడా  పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల నుంచి అభ్యర్థులతో బరిలో దింపించడానికి  కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇదంతా దగ్గర ఉండి  చూసుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి మీదే ఉంచింది అధిష్టానం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − four =