గుడ్‌ఫ్రైడే సందర్భంగా.. ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను స్మరించుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్

Telugu States CMs KCR and Jagan Remembers Great Sacrifice of Jesus Christ on The Eve of Good Friday,Telugu States CMs KCR and Jagan Remembers Great Sacrifice,Great Sacrifice of Jesus Christ,Telugu States on The Eve of Good Friday,CMs KCR and Jagan on The Eve of Good Friday,Mango News,Mango News Telugu,CM KCR extends Good Friday greetings,Telangana CM extends wishes,AP CM YS Jagan Greets People on Easter,Good Friday 2023,Good Friday in Andhra Pradesh in 2023,Telangana Good Friday 2023,Telugu States Good Friday Latest News and Updates

నేడు ‘గుడ్‌ఫ్రైడే’ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ప్రజల కోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. ‘గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు పవిత్రమైన రోజు. మానవాళికి సార్వత్రిక సోదరభావాన్ని పెంపొందించడంలో యేసుక్రీస్తు బోధలు సహాయపడతాయి. సిలువపై తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుడిని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు. ఆయన జీవితంలో పాటించిన నిస్సహాయుల పట్ల జాలి, అవధులులేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను ప్రతి ఒకరూ పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని అన్నారు.

ఇక ఏపీ సీఎం జగన్.. ‘గుడ్ ఫ్రైడే యేసు పునరుత్థానాన్ని సూచించే ఈస్టర్ ఆదివారం ముందు శిలువ వేయడాన్ని సూచిస్తుంది. ఇది మానవజాతి పట్ల బేషరతు ప్రేమ, పేదవారి పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాపణ మరియు ఆదర్శప్రాయమైన సహనం మరియు అపరిమితమైన త్యాగంతో బాధలను సహించడాన్ని సూచిస్తుంది. ఇది మానవాళికి క్రీస్తు సందేశం, ఇది సమయం మరియు ప్రదేశంలో విశ్వవ్యాప్త ప్రాముఖ్యతను కలిగి ఉంది’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కాగా గుడ్‌ఫ్రైడేను ప్రజలు భక్తిశ్రద్ధలతో, దైవప్రార్థనలతో జరుపుకోవాలని, ప్రజల మధ్య శాంతి, సామరస్యం విలసిల్లాలని ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − ten =