ప్రముఖ దర్శకుడు రాజమౌళి మరో ఘనత.. ఉత్తమ దర్శకుడిగా ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డు సొంతం

Tollywood Filmmaker SS Rajamouli Wins Best Director Award At NYFCC For RRR Movie,Tollywood Filmmaker SS Rajamouli,Rajamouli Wins Best Director Award,NYFCC For RRR Movie,Mango News,Mango News Telugu,RRR Tops Movie List In IMDb,RRR IMDB,Ss Rajamouli Movies Imdb,RRR Release Date,RRR Full Movie,RRR Movie Release Date 2022,RRR Movie Budget And Collection,RRR Movie Full Form 2022,RRR Collection,Ram Charan,RRR Box Office Collection,RRR Oscar,RRR Cast,RRR Trailer,RRR Songs,RRR Showtimes,

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డును సొంతం చేసుకున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ దర్శకుడిగా ఆయనను జ్యూరీ ఎంపిక చేసింది. ఇక ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని, ఇది తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. అలాగే తన చిత్రాన్ని ఆదరించినందుకు జ్యూరీకి మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక దక్షిణ భారతదేశంలోని ఒక సినిమా గురించి ఇంత పెద్ద వేదికపై మాట్లాడటం గొప్ప అనుభూతినిస్తోందని పేర్కొన్నారు. ఒక సినిమా రూపొందించేటప్పుడు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తీస్తానని తెలిపిన ఆయన, వారికి థియేటర్లో అనుభూతి చెందాలని తాను కోరుకుంటానని చెప్పారు. ఇక తన సినీ ప్రయాణంలో నిరంతరం వెంట ఉండి మద్దతునిస్తున్న తన కుటుంబానికి రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా రాజమౌళి తీసిన హిస్టారికల్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై దాదాపు పది నెలలైంది. టాలీవుడ్ ప్రముఖ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ‘కొమురం భీం’ ‘అల్లూరి సీతారామ రాజు’ లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1200 కోట్లు కొల్లగొట్టి, అనేక ప్రముఖ అవార్డులను సైతం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఓటీటీలో విడుదలై ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటోంది. ఇక దీని తర్వాత రాజమౌళి ఆస్కార్ 2023పై దృష్టి సారించనున్నారు. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఉత్తమ పాటల విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడి, ఆస్కార్ నామినేషన్స్ కోసం పోటీ పడుతోంది. తద్వారా అకాడెమీ అవార్డుల కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన మొదటి భారతీయ పాటగా ఇది నిలిచింది. ఇది కాకుండా, ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ పొందింది. అలాగే దీనికి మరో నాలుగు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.. ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ భాషా చిత్రం, ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాలలో పలు అంతర్జాతీయ సినిమాలతో పోటీ పడుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + fourteen =