కడపలో కాక పుట్టిస్తున్న రాజకీయాలు

YS Sunita Reddy,Sunitha Reddy, election,Kadapa Politics,YS Rajasekhar Reddy, YS Vivekananda Reddy, Sharmila, Jagan, Congress, TDP, YCP, BJP,AP Elections,Mango News Telugu,Mango News
YS Sunita Reddy,Sunitha Reddy, election,Kadapa Politics,YS Rajasekhar Reddy, YS Vivekananda Reddy, Sharmila, Jagan, Congress, TDP, YCP, BJP,

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. అన్ని జిల్లాల కంటే కడప జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు..దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఈసారి ఎన్నికల బరిలో నిలవనున్నారన్న వార్తతో ఇప్పుడు కడపలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.మొన్నటి వరకూ సునీత తల్లి సౌభాగ్యవతి పేరు వినిపించగా ఇప్పుడు సునీత పేరు తెరమీదకు వచ్చింది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత.. రోజురోజుకి మారుతున్న పరిణామాలతో వైఎస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి రోజు అనగా..మార్చి  15వ తేదీన తన రాజకీయ భవిష్యత్తుపై సునీత కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో రానున్న ఎన్నికల బరిలో ఉంటానని ఇప్పటికే  చెప్పిన సునీత.. మార్చి 15న జరిగే ఆత్మీయ సమావేశంలో తన రాజకీయ  ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వినపిస్తున్నాయి.

సునీత రెడ్డి కొద్ది రోజులుగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి కావాల్సిన అన్ని సన్నాహాలు మెల్లగా  చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిలతో భేటీ అయిన సునీత ఆమెతో సుదీర్ఘ చర్చలు జరిపారు. మరోవైపు టీడీపీతో కూడా సత్సంబంధాలను  కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇటు కాంగ్రస్ నుంచి , అటు  టీడీపీ నుంచి కాకుండా తను ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనే  ఆలోచనతో సునీత రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే కాంగ్రెస్‎కు బీజేపీతో పడదు. కానీ టీడీపీ, బీజేపీతో పొత్తు పె ట్టుకుంటుంది. దీంతో ఏదొక పార్టీ నుంచి పోటీ చేస్తే తనకు రాజకీయంగా ఇబ్బంది అని భావించిన సునీత స్వతంత్ర అభ్యర్థిగా  పోటీ చేయడానికే మొగ్గు చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇలా అయితే కాంగ్రెస్,టీడీపీ నుంచి తనకు మద్దతు ఇస్తారనే ఉంటుందనే లెక్కలతో ఇండిపెండెంటుగానే బరిలో దిగడానికి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటు తన తల్లి సౌభాగ్యమ్మను ఎన్నికల బరిలో నిలుపుతారా లేదా అన్న విషయంపైన కూడా ఆత్మీయ సమావేశంలో   సునీత క్లారిటీ ఇవ్వనున్నారు.వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయి ఐదేళ్లు గడుస్తుండటంతో.. వివేకా ఆత్మీయులు, సన్నిహితులతో సునీత రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. కడపలోని వివేకానంద రెడ్డి కుటుంబానికి చెందిన ఫంక్షన్ హాల్ జయరాం గార్డెన్స్‎లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 7 =