పొలిటికల్ సీన్‌లో ఊహించని వ్యక్తికి టికెట్

Bhimavaram, Pawan Kalyan, Janasena,Varaprasad, Rajolu Janasena candidate, Ap political updates,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Andhra Pradesh,AP,Mango News Telugu, Mango News
Bhimavaram, Pawan Kalyan, Janasena,Varaprasad, Rajolu Janasena candidate, Ap political

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పాటు..మరో రెండు, మూడు రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా ఫోకస్‌ పెట్టాయి. తాజాగా ఇలా జనసేనాని కూడా ఫోకస్ పెంచి.. రాజోలు జనసేన అభ్యర్థి ఖరారయినట్లు  పవన్ ప్రకటించారు. రాజోలు అభ్యర్థిగా దేవ వరప్రసాద్ ను పవన్ ఖరారు చేశారు. అయితే లాస్ట్ మినిట్ వరకూ ఈ సీటుపై తీవ్ర ఉత్కంఠ జరిగిందని.. చివరకు తీవ్ర తర్జనభర్జన నడుమ దేవ వరప్రసాద్ అభ్యర్థిత్వాన్ని జనసేన అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల సమయం నుంచి జనసేన పార్టీకి రాజోలు కంచుకోటగా మారినట్లే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక వరప్రసాద్..జనసేన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అయితే గెలిచిన  కొద్ది రోజులకే ఆయన జనసేనను వీడి.. వైసీపీలోకి జంపయ్యారు.

దీంతో రాపాక వరప్రసాద్‌పై రగిలిపోతున్న జనసైనికులు గత నాలుగున్నర సంవత్సరాలుగా కసితో పనిచేస్తూ వచ్చారు. ఇక్కడ జనసేన నుంచి ఏ  అభ్యర్థిని నిలబెట్టినా తాము  గెలిపించుకుంటామంటూ తేల్చి చెబుతున్నారు. సిట్టింగ్ స్థానం కావడంతో కూటమి పొత్తులో భాగంగా  రాజోలును జనసేన పార్టీకే కేటాయించారు.ఇక్కడ గెలుపు సునాయాసం కావడంతో పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది.  కానీ నియోజకవర్గంలో సర్వే చేపట్టిన జనసేన.. అనూహ్యంగా  దేవ వరప్రసాద్‌ను ఎంపిక చేసింది.

రాజోలు నుంచి  పోటీ చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. అందులో ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు.వారిలో దేవ వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు. వర ప్రసాద్ చంద్రబాబు గవర్నమెంటులో కీలక అధికారిగా పనిచేసారు.ఇటు  పవన్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ.. జనసేన జనవాణి కార్యక్రమాలకు ఇన్చార్జ్‌గా కూడా వ్యవహరించారు. వరప్రసాద్ సొంత గ్రామం రాజోలు నియోజకవర్గం పరిధిలో ఉండం… అటు చంద్రబాబుతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే దేవ వరప్రసాద్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అలాగే డాక్టర్ రాపాక రమేష్ బాబు కూడా జనసేన సీటును ఆశించారు. డాక్టర్ కావడంతో..ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. గతంలో జనసేన తరఫున సర్పంచ్ గా కూడా రాపాక రమేష్ బాబు ఎన్నికయ్యారు. మూడేళ్లుగా జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తూ వచ్చారు.

వీరిద్దరితో పాటు మరో సీనియర్ నేత అయిన బొంతు రాజేశ్వరరావు  కూడా జనసేన టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో బొంతు రాజేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రాపాక వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. కానీ జనసేన నుంచి గెలిచిన రాపాక వైసీపీలో చేరడంతో.. బొంతు రాజేశ్వరరావు పవన్  వైపు వచ్చారు.

అయితే  ఈ ఎన్నికల గురించి చేసిన సర్వేల్లో దేవ వరప్రసాద్ ఈ ముగ్గురిలో ముందంజలో ఉండడంతో.. పవన్ ఆయనకే టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అనూహ్య పరిణామాల మధ్య కూటమి అభ్యర్థిగా దేవ వరప్రసాద్ నిలవగా.. అటు వైసీపీ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు నిలబడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =