ఏ పార్టీ పోటీ చేస్తుందో తెలియని పరిస్థితి

Tirupati Parliament Candidates,Panabaka Lakshmi, former Karnataka CS Ratnaprabha, Ratnaprabha's daughter Niharika, sitting MP Gurumurthy,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,andhra pradesh,AP Political updates,tirupathi,Mango News Telugu,Mango News
Tirupati Parliament Candidates,Panabaka Lakshmi, former Karnataka CS Ratnaprabha, Ratnaprabha's daughter Niharika, sitting MP Gurumurthy

తిరుపతి పార్లమెంటుపై ఇప్పటికే ఫుల్ క్లారిటీతో ఉన్న వైసీపీ.. సిట్టింగ్ ఎంపీని అటు ఇటుగా మార్చి ఎట్టకేలకు తిరుపతి అభ్యర్థిగానే  ఫిక్స్ చేసేసింది. కానీ వైసీపీతో పోటీ చేయడానికి ప్రతిపక్ష పార్టీకి మాత్రం  పొత్తుల పేచీ ఏర్పడింది. దీంతో  అక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.  అసలు ఈ  పొత్తు ఏ పార్టీకి కలిసి వస్తుందో అన్న సందిగ్ధత అపోజిషన్ పార్టీ నేతల్లో నెలకొంది.

తిరుపతి పార్లమెంటు ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గం కావడంతో.. అన్ని పార్టీలకు ఇది ముఖ్యమైన నియోజకవర్గంగా మారింది . కానీ  తిరుపతి ఎంపీ అభ్యర్ధికి టికెట్ కేటాయింపుతో పాటు, పోటీ విషయంలో కూడా అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య అభ్యర్థుల ఊగిసలాట కొనసాగింది..కొనసాగుతోంది కూడా. తిరుపతి, చిత్తూరు ఎంపీల స్థానాలను మార్పు చేసిన వైఎస్సార్సీపీ అధిష్టానం చివరకు ..ఇద్దరినీ అదే స్థానంలో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది.

తిరుపతి పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికే సీఎం జగన్ అవకాశమిచ్చారు. అలా అధికారపక్షం ఏ  కన్ఫ్యూజన్ లేకుండా దూసుకుపోతుండగా..ప్రతిపక్షంలో నిలబడే అభ్యర్థి ఎవరన్న దానిపైన ఇప్పుడు అయోమయం కొనసాగుతోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న  టీడీపీ..కొత్త పొత్తులో భాగంగా బీజేపీతోనూ చేయి కలిపితే.. అప్పుడు కూటమి తరపున   ఎవరిని బరిలో ఉంచాలనే దానిపై  క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.

ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో..  గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయిన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పోటీలో ఉన్నారు.ఇటు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన.. కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ కుటుంబం పేరు బలంగా వినిపిస్తోంది. రత్నప్రభ కూతురు నిహారిక ఇప్పుడు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఫైనల్ అన్న వార్తలు  పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే నిహారిక టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారా.. లేదంటే ఏ పార్టీకి టికెట్ కేటాయిస్తే ఆ పార్టీ కండువా కప్పుకుని బరిలో దిగుతారా అన్న టాక్ నడుస్తోంది.

గతంలో పొత్తులో బాగంగా తిరుపతిని టీడీపీ.. బీజేపీకి కేటాయించడంతో.. భారతీయ జనతా పార్టీ ఎంపీగా  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటస్వామి విజయాన్ని సాధించారు. అందుకే ఇప్పుడు కూడా బీజేపీ తిరుపతిని కోరుకునే అవకాశం ఉంది. ఒకవేళ పొత్తు కుదిరితే  గత తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా లాస్ట్ మినిట్‌లో పోటీకి  దిగిన కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ కూతురు నిహారిక.. కాషాయ కండువా కప్పుకుని బరిలో దిగే అవకాశం ఉంది.

ఇటు ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానన్న ధీమాతో ఉన్న పనబాక లక్ష్మి..ఇప్పుడు తెరమీదకు వచ్చిన కొత్త సమీకరణలతో అసంతృప్తికి గురవుతున్నారట. అయితే పనబాక లక్ష్మిని సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వుర్డ్ అసెంబ్లీ స్థానానికి పంపి..నిహారికను బరిలో దింపడానికే చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారట. దీంతో  మాజీ ఎంపీ తలారి మనోహర్ కుటుంబం కోడలిగా నిహారిక టీడీపీ తరఫున పోటీ చేస్తారా.. లేదంటే పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతారా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + eight =