అక్కడ టీడీపీ జెండా ఎగరేయగలదా?

YSR, TDP flag, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan, Vijayamma, YS Rajasekhar Reddy,Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
YSR, TDP flag, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan, Vijayamma, YS Rajasekhar Reddy

ఎన్నికలు ఎప్పుడొస్తున్నా అందరి చూపూ పులివెందుల నియోజకవర్గంపైనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఏపీలో ఎన్నిసార్లు అసెంబ్లీ ఎన్నికలు  జరిగినా అన్ని సార్లు కూడా వైఎస్సార్ కుటుంబానికి విజయాన్ని అందిస్తూనే ఉంది. దీంతో వైఎస్సార్ కుటుంబానికి  కంచుకోటగా మారిన పులివెందులలో వేరే ఎవరూ కూడా ఇప్పటి వరకూ విక్టరీ అకౌంట్ కూడా తెరవలేదు.

తాజాగా ఈరోజో, రేపో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మొదటి చి కంచుకోటగా ఉంటున్న పులివెందుల నియోజకవర్గాన్ని.. మరోసారి తమ గెలుపు ఖాతాలో వేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.మరోవైపు 40 ఏళ్ల కంచుకోటను బద్దలు కొడతామని టీడీపీ, జనసేన కూటమి ఈ కుటుంబంతో పోటీ పడుతోంది.

నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత పులివెందులలో మొదటిసారిగా  జరిగిన 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. 1962లో  మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఆ తర్వాత 1962 నుండి 2009 వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ప్రభంజనంలా వీచిన ఎన్టీఆర్ గాలిని కూడా తట్టుకొని.. పులివెందుల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2010, 2011 సంవత్సరంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కూడా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు మరోసారి అక్కడి నుంచే పోటీచేయడానికి రాజశేఖర్ రెడ్డి  అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అయితే మారిన రాజకీయ సమీకరణాలతో వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉందని..టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బీజేపీ, జనసేనను కలుపుకొని వెళ్లి పులివెందులలో కూడా టీడీపీ జెండాను ఎగిరేలా చేస్తామనే నమ్మకంతో  చంద్రబాబు ఉన్నారు. కానీ రాజకీయ పరిస్థితులు ఎంతగా మారినా కూడా  పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబంపై గెలిచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం అంత ఈజీ కాదని.. కాకపోతే ప్రజాతీర్పు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =