అర్జంటుగా ఆ అలవాట్లు మార్చుకోకపోతే అంతే సంగతులట

Your Habits Are The Cause Of Brain Stroke, Cause Of Brain Stroke, Brain Stroke Causes, Brain, Habits, Brain Stroke, Hypertension, High Cholesterol, Diabetes, Irregular Heart Beat, Doctors, Health News, Health Tips, Healthy Food, Food Diet, Mango News, Mango News Telugu
Your habits are the cause of brain stroke,habits, brain stroke,Hypertension, High Cholesterol, Diabetes, Irregular Heart Beat, Doctors,

మనిషికి ఉన్న చెడ్డ అలవాట్ల వల్లే బ్రెయిన్ స్టోక్ కూడా వస్తుందని డాక్టర్లు మరోసారి దృవీకరించారు. బ్రెయిన్ స్ట్రోక్ సమస్య రావడం వల్ల భవిష్యత్తులో హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, డయాబెటిస్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎన్నో వస్తాయని వివరించారు. ఇవి ఒక్కసారి వచ్చాయంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం అంటున్నారు.

=బ్రెయిన్‌లో బ్లడ్ సప్లైకి ఇబ్బంది అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ టిష్యూలులోకి ఆక్సిజన్ కానీ, పోషక పదార్థాలు కానీ అందలేదంటే స్ట్రోక్ సమస్య వస్తుంది. అయితే చాలా మంది చేసే కొన్ని తప్పుల వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మనకు ఉన్న కొన్ని అలవాట్లు మార్చుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి బయటపడొచ్చంటున్నారు.

కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోవడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. ప్రెగ్నెన్సీ గండం నుంచి గట్టెక్కొచ్చేమో కానీ దాని వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వలన స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుందట.సరైన జీవన విధానం లేకపోవటం కూడా బ్రెయిన్ స్ట్రోక్ కూడా కారణం అని డాక్టర్లు వివరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడం వల్ల స్ట్రోక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. స్ట్రోక్ ఒక్కటే కాదు..అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఇవే మెయిన్ రీజన్ అవుతున్నాయంటున్నారు.

ఈరోజుల్లో ఆడామగ అని తేడా లేకుండా చాలా వరకూ స్మోకింగ్ చేసేస్తున్నారు. స్మోకింగ్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు .. పైగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నవారిలో కూడా స్ట్రోక్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రోజుకి రెండు పెగ్గుల కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు.

చాలామంది ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇష్టపడరు కానీ దీని వల్ల ఒబిసిటీ సమస్య కూడా వస్తుంది ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు కారణంగా మారొచ్చని వైద్యులు అంటున్నారు. అందుకే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే చాలా రోగాలను దూరం పెట్టొచ్చు. శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి కూడా వ్యాయామం ఎంతగానో సహాయపడుతుంది. అలానే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరిపడా నీళ్లు తాగడం లాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 1 =