18 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…

YSRCP Announces 18 Candidates for Local Bodies, MLA, Governor Quota MLC Elections,YSRCP Announces 18 Candidates,Mango News,Mango News Telugu,YSRCP,YSRCP Party,YSRCP Live,YSRCP Party News,YSRCP Party Latest News,YSRCP Party Live News,YSRCP Party Live,MLC Elections,MLC Elections 2023,2023 MLC Elections,YSRCP MLC Elections 18 Candidates,YSRCP List Of 18 Candidates For AP MLC Polls 2023,YSRCP MLC Candidates,YSRCP MLC Candidates 2023,YSRCP Announces 18 Candidates For MLC Polls,YSRCP Announces 18 Candidates For Upcoming MLC Elections,MLC Polls 2023,2023 MLC Polls

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 9 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్‌ ను విడుదల చేసిన తెలిసిందే. త్వరలో ఎమ్మెల్యే కోటా నుంచి 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలతో పాటుగా, గవర్నర్ కోటాకు సంబంధించి 2 స్థానాలు కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) ఒకేసారిగా తమ అభ్యర్థులను ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాల‌కు గానూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వెల్ల‌డించారు.

సోమ‌వారం మధ్యాహ్నం తాడేప‌ల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. బీసీలు అంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని మేం భావిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే పాటిస్తున్నామని చెప్పారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ 11 బీసీలకు, 2 ఎస్సీలకు, 1 ఎస్టీలకు, 4 ఓసీలకు కేటాయించారు.

స్థానిక సంస్థల కోటా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు:

  1. నర్తు రామారావు – శ్రీకాకుళం – (బీసీ-యాదవ)
  2. కుడుపూడి సూర్యనారాయణ – తూర్పు గోదావరి (బీసీ-శెట్టి బలిజ)
  3. వంకా రవీంద్రనాథ్‌ – పశ్చిమ గోదావరి (ఓసీ-కాపు)
  4. కవురు శ్రీనివాస్‌ – పశ్చిమ గోదావరి (బీసీ-శెట్టి బలిజ)
  5. మేరుగ మురళీధర్ – నెల్లూరు (ఎస్సీ-మాల)
  6. సిపాయి సుబ్రహ్మణ్యం – చిత్తూరు (బీసీ-వన్నెరెడ్డి)
  7. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి – వైఎస్ఆర్ – (ఓసీ-రెడ్డి)
  8. ఏ.మధుసూదన్‌ – కర్నూలు – (బీసీ- వాల్మీకి బోయ)
  9. ఎస్‌. మంగమ్మ – అనంతపురం – ( బీసీ- వాల్మీకి బోయ)

ఎమ్మెల్యే కోటా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు:

  1. పెనుమత్స సూర్యనారాయణ – విజయనగరం – (ఓసీ-క్షత్రియ)
  2. పోతుల సునీత – బాపట్ల – (బీసీ- పద్మశాలి)
  3. కోలా గురువులు – విశాఖపట్నం – (బీసీ-వడ బలిజ)
  4. బొమ్మి ఇ‍జ్రాయిల్‌ – డా.బీఆర్ అంబెడ్కర్ కోనసీమ – (ఎస్సీ-మాదిగ)
  5. జయమంగళ వెంకటరమణ – ఏలూరు – ( బీసీ-వడ్డీ)
  6. చంద్రగిరి ఏసు రత్నం – గుంటూరు -(బీసీ-వడ్డెర)
  7. మర్రి రాజశేఖర్‌ – పల్నాడు – (ఓసీ-కమ్మ)

గవర్నర్‌ కోటా:

  1. కుంభా రవిబాబు – అల్లూరి సీతారామరాజు – (ఎస్టీ-ఎరుకల)
  2. కర్రి పద్మశ్రీ – కాకినాడ – (బీసీ-వడ బలిజ).

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 19 =