ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వివాహాలకు 150 మందికి మాత్రమే అనుమతి

150 limit for weddings, Andhra Pradesh, AP Coronavirus, AP Coronavirus Guidelines, AP Govt, AP Govt Issued Orders to Permit Maximum 150 People, AP Govt Issued Orders to Permit Maximum 150 People for Weddings, AP issues guidelines for marriages, Government allows weddings number of guests limited, Government restricts number of guests for weddings, Government restricts number of guests for weddings in Andhra, Mango News, no crowds at religious events

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా పెళ్లిళ్లకు గరిష్టంగా 150 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. పెళ్లిళ్లతో పాటుగా ఏదైనా శుభకార్యాలు/ఫంక్షన్లు, ప్రార్థనలు వంటి కార్యక్రమాలైనా సరే 150 మందికి మించి హాజరు కావడం లేదా గుమికూడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల సందర్భంగా అన్ని కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి నిబంధనలు పాటించాలని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో సినిమా థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలకు ప్రభుత్వం సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + ten =