ఎపిసోడ్ 30( ఆగస్టు 19) హైలైట్స్: నామినేషన్ పక్రియ- ఏడ్చినా బాబా భాస్కర్

Bigg Boss Episode 30, Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode 30, Bigg Boss Season 3 Telugu Episode 30 Highlights, Bigg Boss Season 3 Telugu Latest Updates, Bigg Boss Season 3 Telugu weekend Episodes Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 30, Mango News Telugu

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి ఎలిమినేట్ అవ్వగా ఇంటిలో 12 మంది సభ్యులున్నారు. ఆగస్టు 19న ప్రసారమైన బిగ్ బాస్-3 ముప్ఫైవ ఎపిసోడ్ లో నామినేషన్ పక్రియ కొనసాగింది. ఇంటి కెప్టెన్ అలీరేజాను నామినేషన్స్ నుంచి మినహాయించి, నలుగురిని నామినేట్ చేయమని కోరారు. అలీని మెప్పించిన ముగ్గురిని కాకుండా, చివరకు ఒకరిని నామినేట్ చేస్తాడని సూచించారు. నామినేషన్స్ లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య హాట్ హాట్ గా డిస్కషన్ జరిగింది.

ఎపిసోడ్ 30( ఆగస్టు 19) హైలైట్స్: నామినేషన్ పక్రియ- ఏడ్చినా బాబా భాస్కర్

  • ఆపిల్ బ్యూటీ సాంగ్ కి ఇంటి సభ్యులు డాన్స్ చేసారు
  • ఎవరిని నామినేట్ చేయాలనీ వరుణ్ సందేశ్, వితికా, పునర్నవి చర్చించుకున్నారు
  • ఇంటి కెప్టెన్ అలీరేజాను నామినేషన్స్ నుంచి మినహాయించి, నలుగురిని నామినేట్ చేయమని బిగ్ బాస్ కోరతాడు
  • నామినేషన్ పక్రియ ముగిసే సరికి అలీని మెప్పించిన ముగ్గురిని కాకుండా, చివరకు ఒకరిని నామినేట్ చేస్తాడని బిగ్ బాస్ చెప్తాడు
  • రాహుల్, హిమజ, బాబా భాస్కర్, వితికా పేర్లను అలీ చెప్తాడు
  • బాబాబాస్కర్, రాహుల్, వితికా అలీని మెప్పించడానికి ప్రయత్నించారు
  • తనను ఎందుకు నామినేట్ చేసాడో అర్ధం కావడం లేదని హిమజ అలీతో వాదించింది
  • శివజ్యోతి ఇప్పటికే నామినేట్ అయినందువలన తన పేరు చెప్పవద్దని బిగ్ బాస్ కోరాడు
  • బాక్స్ లో రెడ్ బాల్ వస్తే కన్ఫెషన్ రూంకి వెళ్లి నామినేట్ చెయ్యాలని, బ్లాక్ బాల్ వస్తే వారి మొహాలపై రంగు పూసి నామినేట్ చెయ్యాలని బిగ్ బాస్ సూచిస్తాడు

నామినేషన్స్ ఈ విధముగా కొనసాగాయి:                                                                                                       

  • పునర్నవి- హిమజ, రాహుల్ లను నామినేట్ చేసింది
  • బాబా భాస్కర్-రాహుల్, అషు నామినేట్ చేసాడు
  • రవికృష్ణ- రాహుల్, హిమజ లను నామినేట్ చేసాడు
  • వితికా షెరు-మహేష్ విట్టా, అషు లను నామినేట్ చేసింది
  • శ్రీముఖి-రాహుల్ , అషు లను నామినేట్ చేసింది
  • రాహుల్- హిమజ, శ్రీముఖి లను నామినేట్ చేసాడు
  • అషు- హిమజ, రాహుల్ లను నామినేట్ చేసింది
  • వరుణ్- రాహుల్, మహేష్ విట్టా లను నామినేట్ చేసాడు
  • శివజ్యోతి- పునర్నవి, రాహుల్ లను నామినేట్ చేసింది
  • మహేష్ విట్టా- రాహుల్, వరుణ్ సందేశ్ లను నామినేట్ చేసాడు
  • హిమజ-పునర్నవి, అషు లను నామినేట్ చేసింది
  • అలీ చివరకు బాబా భాస్కర్‌‌ను నామినేట్ చేశారు.                                                                                                                               
  • ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ కి రాహుల్, హిమజ, అషు, పునర్నవి, మహేష్, శివజ్యోతి, బాబాబాస్కర్ నామినేట్ అయ్యారు
  • అలీరేజా చెప్పిన రీజన్ బాధపెట్టింది అంటూ బాబాబాస్కర్ కన్నీరు పెట్టుకున్నారు
  • హాట్ హాట్ గా నడిచిన నామినేషన్స్ పై సభ్యులు చర్చించుకున్నారు.
  • ఈ రోజు ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =