తెలంగాణ, ఏపీలలో ఏకగ్రీవంగా ఎన్నికైనా ఎమ్మెల్సీలు

AP Latest Political News, AP Political Updates 2019, Mango News, Mango News Telugu, MLC elections 2019, MLC elections in Telangana and AP, MLC elections results 2019, MLCs unanimously elected in AP, MLCs unanimously elected in Telangana, MLCs Unanimously Elected In Telangana And AP, Telangana Political Live Updates, Telangana Political News, Telangana Political Updates 2019

మాజీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఆయన ఒక్కరు మాత్రమే బరిలో ఉండడంతో ఆగస్టు 19న ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. శాసనసభ కార్యదర్శి నరసింహచార్యులు గుత్తా సుఖేందర్ రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేసారు. మీడియాతో మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు జి. జగదీష్ రెడ్డి, వి. ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బి. లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.

మరో వైపు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ అయినా మూడు స్థానాలకు నామినేషన్స్ దాఖలు చేసిన వైసీపీ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ ఇంచార్జ్ కార్యదర్శి పి. బాలకృష్ణమాచారి సోమవారం నాడు మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ వరద సహాయక చర్యల్లో పాల్గొనడం వలన రాలేకపోతున్నట్టు సమాచారం ఇచ్చారు. ఖాళీ అయిన స్థానాలకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి నామినేషన్స్ రాకపోవడంతో, వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

 

[subscribe]
[youtube_video videoid=COlHkG3c-b8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =