పృథ్వీ హీరోగా శోభన్‌బాబు మూవీ.. ఈసారి శ్యాంబాబుగా ఫుల్ లెంగ్త్ పాత్ర

Tollywood Comedian Prudhvi Raj Taking Up Full Length Role in Sobhan Babu Cinema After Shyam Babu Character in Bro Movie,Tollywood Comedian Prudhvi Raj,Prudhvi Raj Taking Up Full Length Role,Full Length Role in Sobhan Babu Cinema,After Shyam Babu Character in Bro Movie,Mango News,Mango News Telugu,Shobhanbabu movie as Prithvi's hero, full length role as Shyambabu, Prithvi, YCP Leaders, BRO Movie, Pavan Kalyan, Chiranjeevi,Tollywood Comedian Prudhvi Raj Latest News,Tollywood Comedian Prudhvi Raj Latest Updates,Tollywood Comedian Prudhvi Raj Live News

బ్రో సినిమా వివాదం ఇంకా ఏపీ మంత్రి అంబటి రాంబాబును వదలను అంటోంది. ఈ సినిమాలో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ శ్యాంబాబు పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఏకంగా మీడియా సమావేశం పెట్టి మంత్రి రాంబాబు పవన్ మూవీపై, క్యారెక్టర్‌పై కామెంట్లు కూడా చేశారు. అయితే ఈ పాత్రకు అంబటి రాంబాబుకి సంబంధమే లేదని.. ఆయనను అనుకరించే పెద్ద నటుడు కాదని పృథ్వీ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ వివాదం ఇప్పుడు చిరంజీవి తాజా వ్యాఖ్యలతో మరింత ముదిరింది. ఈ టైమ్‌లోనే నటుడు పృథ్వీరాజ్ విడుదల చేసిన ఒక వీడియో సంచలనంగా మారింది.

ఇంకా చెప్పాలంటే.. బ్రో సినిమాలో శ్యాంబాబు రోల్ రాజకీయ వివాదానికి కారణమైంది. దీని పైన వైసీపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడగా.. సహచర మంత్రులు మద్దతుగా నిలిచారు. నిజానికి ఈ ఏడాది సంక్రాంతి సమయంలో మంత్రి రాంబాబు తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో వేసిన డాన్స్‌ చేశారు. ఇప్పుడు బ్రో సినిమాలో అదే సీన్‌ను అనుకరిస్తూ చేసిన పాత్ర పృథ్వీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అంబటి రాంబాబు తన గురించి బ్రో సినిమాలో ప్రస్తావించారంటూ ఢిల్లీ వరకు విషయాన్ని తీసుకెళ్లారు. అంతేకాదు సినిమా కలెక్షన్ల గురించి ఆరా తీయమని విన్నవించారు.ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగానే.. ఇప్పుడు పృథ్వీరాజ్ చేసిన తాజా ప్రకటన ఆసక్తి కరంగా మారింది.

పృథ్వీ రాజ్‌ తనుకు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని అన్నారు. శోభన్ బాబు పేరుతో రాబోతున్న ఈ కొత్త మూవీలో శ్యాంబాబు పాత్ర ఏకంగా రెండు గంటలు ఉంటుందని పృథ్వీ చెప్పుకొచ్చారు. ఈ మూవీకి సంబంధించిన పృథ్వీ రాజ్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర 1 నిమిషం 5 సెకన్లు ఉంటే, కొత్తగా చేయబోయే శోభన్ బాబు సినిమాలో రెండు గంటలు ఉంటుందని చెప్పారు. నిజంగా ఇది తనకు ఓ అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు ఎవరు? ఏ బ్యానర్‌లో ఈ సినిమా చేస్తున్నా అనే వివరాలు త్వరలోనే తెలియచేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అది గ్యారంటీగా తన కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రం అవుతుందని దీమాగా చెప్పారు. ఈ శ్యాంబాబును కూడా ఆడియన్స్ ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెబుతూ.. సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.

తాజాగా వాల్తేరు వీరయ్య 200వ రోజు ఫంక్షన్‌లో మెగాస్టార్.. ఏపీ ప్రభుత్వం పైన చేసిన కామెంట్లతో రోజుకో నేత బయటకు వచ్చి మరీ చిరంజీవికి కౌంటర్లు ఇస్తున్నారు. ఏపీ ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర సంక్షేమం, అక్కడ రోడ్లు, ప్రభుత్వపాలన పైన మంచి నిర్ణయాలు తీసుకోవాలని చిరంజీవి చెబుతూనే అవన్నీ చేయకుండా సినీ ఇండస్ట్రీ మీద పడతారేంటి అని చురకలు అంటించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలపైన వరుసగా మెగాస్టార్‌కు సమాధానం ఇస్తూ.. ముందుగా పవన్‌కు సూచనలు చేయాలని సెటైర్లు వేస్తున్నారు. ఈ కాంట్రవర్సీ మంచి ఊపుమీదున్న ఈ సమయంలో పృథ్వీ రాజ్ విడుదల చేసిన వీడియో పొలిటికల్ సర్కిల్‌లో మరింత కాక రేపినట్లు అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here