ఎట్టకేలకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ

BS Yediyurappa Expands Karnataka Cabinet, Chief Minister of Karnataka, CM BS Yediyurappa Expands Karnataka Cabinet, expansion of the Karnataka Cabinet, Karnataka CM BS Yediyurappa Expands Karnataka Cabinet, Karnataka CM BS Yediyurappa Inducts 17 Ministers In First Cabinet Expansion, Karnataka CM Expands Karnataka Cabinet, Karnataka Government, Latest National Political News Today, Mango News, National Political News 2019, national political updates, Yediyurappa

కర్ణాటకలో గతనెలలో జరిగిన నాటకీయ పరిణామాల తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడియూరప్ప ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. పదిహేడు మంది సభ్యులకు తన కేబినెట్ లో స్థానం కల్పించారు. ఈ మేరకు పదిహేడు మందితో కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వం బలనిరూపణలో విఫలమైన తరువాత నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడియూరప్ప కేబినెట్ విస్తరణపై, ఆచితూచి వ్యవహరించి మిగతా సభ్యులనుండి ఎటువంటి వ్యతిరేకత లేకుండా బీజేపీ అధిష్టానం సూచనల మేరకే నడుచుకున్నారు.

ఈ రోజు మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో గోవింద్ ముక్తప్ప , ఆశ్వంత్ నారాయణ్ సి.ఎస్, లక్ష్మణ్ సవాడి, కె.ఎస్. ఈశ్వరప్ప, ఆర్.అశోక, జగదీష్ శెట్టర్, బి. శ్రీరాములు, ఎస్.సురేష్ కుమార్, వి.సోమన్న, సీ.టీ. రవి, బసవరాజ్ బొమ్మాయి, కోట శ్రీనివాస్ పూజారి, జె.సి.మధుస్వామి, సి.సి. పాటిల్, హెచ్.నగేష్, ప్రభు చౌహాన్ మరియు శశికళ జోల్లె ఉన్నారు. కర్ణాటకలోని విధాన సౌధలో ముఖ్యమంత్రి బి.ఎస్ యడియూరప్ప కొత్త మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here