గ్రాండ్‌గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఫొటోలు షేర్ చేసిన చిరు

Varun Tej Lavanya Tripathi Pre Wedding Photos Viral on Social Media,Varun Tej Lavanya Tripathi,Pre Wedding Photos Viral on Social Media,Lavanya Tripathi Pre Wedding Photos,Pre Wedding Photos Viral,Mango News,Mango News Telugu,Varun Tej and Lavanyas Pre Wedding Celebration Pics,Varun Tej,Lavanya Tripathi,Pre Wedding Celebration,Pre Wedding Celebration Pics,Varun Tej and Lavanya Tripathi,Chiranjeevi shares glimpse of Varun Tej,Varun Tej Lavanya Latest News,Varun Tej Lavanya Latest Updates,Varun Tej Lavanya Live News
Mega Family

మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలయింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి హడావుడి ప్రారంభమయింది. కొద్దిరోజులుగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వారి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఇటీవలే గ్రాండ్‌గా వారి ఎంగేజ్మెంట్ జరగగా.. అతి త్వరలో ఇద్దరూ పెళ్లి పీఠలెక్కబోతున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వారికి ఎంతో ఇష్టమయిన ఇటలీలో వరుణ్, లావణ్య పెళ్లి చేసుకోబోతున్నారట. ఈనెలలోనే వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి నివాసంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకకు కేవలం మెగా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి,సురేఖ, నాగబాబు, పద్మజ, అంజనా దేవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శ్రీజ కొణిదెల, సుస్మిత కొణిదెల ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను స్వయంగా చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిన్న సాయంత్రం జరిగాయి అని చిరంజీవి రాసుకొచ్చారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్యల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ డ్రెస్సులో వరుణ్ తేజ్, యెల్లో డ్రెస్సులో లావణ్య త్రిపాఠి అదిరిపోయారు. వారి ఫొటోలు నెట్టింట్లో తెగ వైరవుతున్నాయి. చిరంజీవి పోస్ట్ చేసిన కొద్ది క్షణాలకే నెటిజన్లు లక్షల్లో లైకులు, వేలల్లో షేర్లు చేశారు. అలాగే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అటు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలను తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

ఇకపోతే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారి మిస్టర్ సినిమా సమయంలో కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో అంతరిక్షం సినిమా వచ్చింది. మిస్టర్ సినిమా సమయంలో స్నేహితులయిన వరుణ్, లావణ్య అంతరిక్ష సినిమా తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. మీడియా కెమెరాలకు చిక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం సాగించారు. ఇకపోతే యథార్థ సంఘటనల ఆధారంగా.. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. మానుషి చిల్లర్.. వరుణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. నూతన దర్శకుడు ప్రతాప్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 6 =