బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌

Bigg Boss Telugu 3 Winner Rahul, Bigg Boss Telugu 3 Winner Rahul Sipligunj, Bigg Boss Telugu Season 3, Bigg Boss Telugu Season 3 Rahul Sipligunj Wins The Title, Bigg Boss Telugu Season 3 Title Winner, Bigg Boss Telugu Season 3 Title Winner Rahul Sipligunj, Bigg Boss Winner Rahul Sipligunj, Mango News Telugu, Rahul Sipligunj, Rahul Sipligunj Wins Bigg Boss Telugu Season 3 Title, Rahul Sipligunj Wins The Trophy

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-3 టైటిల్ ను సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలుచుకున్నాడు. ప్రముఖ కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. గట్టి పోటీ ఇచ్చిన శ్రీముఖి రన్నరప్‌ గా నిలిచింది. జూలై 21 నాడు ప్రారంభమై, 105 రోజుల పాటు తెలుగు బుల్లితెర ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్న ఈ రియాలిటీ షో నవంబర్ 3, ఆదివారంతో ముగిసింది. కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా ఈ షోని అద్భుతంగా నడిపించారు. బాబా భాస్కర్, అలీరేజా, శివజ్యోతి, రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి, వితిక, వరుణ్ సందేశ్‌, మహేశ్‌ విట్టా, పునర్నవి భూపాలం, రవి కృష్ణ, హిమజ, అషురెడ్డి, రోహిణి, జాఫర్‌, హేమ మొదటగా బిగ్‌బాస్‌ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తరువాత మధ్యలో తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్‌బాస్‌ ఇంట్లోకి అడుగుపెట్టారు. మొత్తం 17 మంది సభ్యులలో రాహుల్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌, అలీరేజా మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ లో మొదటగా అలీరేజా ఎలిమినేట్ అవ్వగా, తరువాత వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక టైటిల్ విజేత బరిలో నిలిచిన రాహుల్, శ్రీముఖిలలో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన రాహుల్‌ విజేతగా నిలిచాడు. షో మొదలైన దగ్గరనుంచి ప్రత్యర్థుల్లా ఒకరితో ఒకరు వాదులాడుకున్న రాహుల్-శ్రీముఖి యే టైటిల్ పోటీలో నిలవడం విశేషం.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-3 ఫినాలే ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చి, వ్యాఖ్యాత నాగార్జునతో కలిసి సందడి చేసారు. హౌస్ మేట్స్ తో సరదాగా మాట్లాడి, తన టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. రన్నరప్ గా నిలిచిన శ్రీముఖికి చిరంజీవి ఉత్సాహాన్ని ఇచ్చారు, తనతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఫినాలే ఎపిసోడ్ లో వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ డాన్సులతో అలరించారు. హీరోయిన్స్‌ అంజలి, కేథరిన్‌, నిషా అగర్వాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజేత రాహుల్‌ మాట్లాడుతూ, తనకు ఓట్లు వేసి గెలిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నానని చెప్పారు. ఈ విజయం తనను పది మెట్లు పైకి ఎక్కించిందని, ఇకపై తన లైఫ్‌ కొత్తగా ఉండబోతుందని చెప్పారు. తన విజయంలో తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేక్షకులు ఎంతో సహకరించి ఇచ్చిన ప్రోత్సాహాన్నీ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ విజయంలో పునర్నవి, వరుణ్‌, వితికాల మద్ధతు కూడ ఉందన్నారు. ఈ సీజన్లో మొత్తం 8కోట్ల 52లక్షల ఓట్లు పోలైనట్లుగా ప్రకటించిన నాగార్జున, బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-3 ని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here