నా ప్రేమను అంగీకరించింది…తన ప్రేయసి ఎవరో చెప్పిన రానా

Hero Rana, Rana, Rana Daggubati, Rana Daggubati Confirms His Relationship, Rana Daggubati confirms relationship, Rana Daggubati Girlfriend Miheeka Bajaj, Rana Daggubati Relationship With Girlfriend Miheeka Bajaj, Rana Daggubati reveals his lady love, Tollywood Breaking News, Tollywood Updates

టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరో దగ్గుబాటి రానా ఇవాళ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టాడు. తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫోటోను పోస్ట్ చేసి తన ప్రేమను ఆమె అంగీకరించిందని చెప్పాడు. రానా ఇచ్చిన ఈ బిగ్ సర్ ప్రైజ్ తో ఆ అమ్మాయి ఎవరూ అనే విషయంపై అభిమానులు అందరూ ఆరా తీశారు. ఆ అమ్మాయి పేరు మిహికా బజాజ్ కాగా, ఆమె డ్యూడ్రాప్ అనే డిజైన్ స్టూడియోను నడుపుతునట్టుగా తెలుస్తుంది. రానా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టడంతో రామ్ చరణ్, సమంత అక్కినేని, కియారా అద్వానీ, నిఖిల్, శ్రుతి హాసన్‌, హన్సిక, రాశీ ఖన్నా తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు ఈ జంటకు తమ శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు ఈ జంట గురించి మరింత తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్ లో ప్రముఖ సినీ కుటుంబాల్లో ఒకటైన దగ్గుబాటి కుటుంబం వచ్చిన రానా లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ లో భల్లాలదేవుడు పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా విశేషమైన పేరు సంపాదించుకున్నాడు. సినిమాలతో పాటు టీవీ షోలతో ప్రేక్షకులకు, అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉండే రానా, తన ప్రేమ జీవితాన్ని మాత్రం ఇంతకాలం రహస్యంగా ఉంచగలిగాడు. రానా తనంతట తానే ప్రేమ విషయాన్ని బయట పెట్టడం, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుండడంతో అభిమానులు ఆనందంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here