తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్ కన్నుమూత, టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

Telugu Film Chamber of Commerce President and Producer Narayan Das Narang Passes Away, Telugu Film Chamber of Commerce President Narayan Das Narang Passes Away, Telugu Film Producer Narayan Das Narang Passes Away, film producer Narayan Das Narang passes away, Telugu Film Producer Narayan Das Narang Passed Away, Veteran film producer Narayan Das Narang, Veteran film producer Narayan Das Narang Passed Away, Narayan Das Narang Passes Away, Producer Narayan Das Narang Passed Away, Tollywood Film producer Narayan Das Narang passes away, Telugu film producer, distributor, president of Telugu Film Chamber of Commerce, distributor Narayan Das Narang Passes Away, Asian Cinemas Owner Narayan Das Narang Passes Away, Asian Cinemas Owner, Narayan Das Narang, Mango News, Mango News Telugu,

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ (76) మంగళవారం కన్నుమూశారు. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడుగా ఉన్నారు నారాయణ్ దాస్ నారంగ్. కొన్ని నెలలుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నారాయణ్ దాస్ నారంగ్ 1980లలో సినిమా ఫైనాన్సర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. నారంగ్ నాలుగు దశాబ్దాల పాటు సినిమాలే జీవితంగా గడిపారు. దాదాపు 650 పైగా చిత్రాలకు ఫైనాన్స్ చేశారు. ఆయన గతంలో నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’, యువ నటుడు నగశౌర్యతో ‘లక్ష’ వంటి చిత్రాలను నిర్మించారు. నారాయణ్ దాస్ నారంగ్ యొక్క రాబోయే ప్రాజెక్ట్‌లలో ధనుష్ హీరోగా ఒక సినిమా, అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా మరో సినిమా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని ప్రముఖ ఏషియన్ మల్టీప్లెక్స్ గ్రూప్‌కు ఛైర్మన్‌గా మరియు అలాగే హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌కు సహ యజమానిగా ఉన్నారు. నారాయణ్ దాస్ నారంగ్‌ కుమారుడు సునీల్ నారంగ్ తెలుగు ప్రముఖ చలనచిత్ర రంగంలోనే కొనసాగుతున్నారు. ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా నారంగ్ మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు అభిమానులు మరియు ప్రముఖులు ట్విట్టర్‌లో సంతాపాన్ని వ్యక్తం చేశారు. “నారాయణదాస్ నారంగ్ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. మన చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప వ్యక్తి. ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ఆయనతో కలిసి పనిచేయడం నాకు దక్కిన అదృష్టం” అని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 4 =