దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3,410 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.74 శాతం

3207 New Covid-19 Cases 29 Deaths Reported in India in the Last 24 Hours, India, India Covid-19, 29 Deaths Reported on India May 8th, 3207 new Covid-19 cases In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India Coronavirus, India Coronavirus Cases, India Coronavirus Deaths, India Coronavirus New Cases, India Coronavirus News, India New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in India, India corona State wise cases, India coronavirus cases State wise, Mango News, Mango News Telugu,

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3 వేలకుపైగా (3,207) పాజిటివ్ కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి. దీంతో మే 9, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,31,05,401 కు, మరణాల సంఖ్య 5,24,093 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.95 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 0.82 శాతంగా ఉంది.

అలాగే గత 24 గంటల వ్యవధిలో 3,410 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,25,60,905 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.74 శాతం గానూ, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 20,403 (0.05%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 3,36,776 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 84.10 కోట్ల (84,10,29,858) కు చేరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 9 =