కరోనా వ్యాక్సినేషన్: రాష్ట్రాలకు16.69 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందజేత

Centre so far Provided More than 16.69 Crore Covid-19 Vaccine Doses to States/UTs Free of Cost,Mango News,Mango News Telugu,Vaccine Doses To Be Provided States And UTs,Centre,Covid-19 Vaccine Doses,Covid-19 Vaccine,Vaccine,Covid-19,Covid-19 Vaccination,Corona Vaccine,Covid Vaccine,Covid-19 Updates,Covid-19 Live Updates,Covid-19 In India,India Covid-19 News,India Coronavirus Updates,India Coronavirus,India Coronavirus News,16.69 Crore Covid-19 Vaccine Doses,Vaccine Doses to States/UTs Free of Cost,Centre Has Provided Nearly 16.69 Crore Covid-19 Vaccine Doses,Coronavirus India live updates,Government of India,Centre To Provide States And UTs With Over 16.69 Crore COVID-19 Vaccine Doses,COVID-19 Vaccine Doses

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారికి వారితో పాటుగా మే 1 నుంచి మూడో దశలో భాగంగా 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 16.69 కోట్లకుపైగా (16,69,97,410) కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందించినట్టు తెలిపారు. ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి మే 3, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 15,94,75,507 డోసులను వినియోగించారని చెప్పారు.

అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 75 లక్షలకుపైగా (75,24,903) కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే రాబోయే 3 రోజుల్లో మరో 48 లక్షలకుపైగా (48,41,670) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =