అసదుద్దీన్‌ ఓవైసీకి జెడ్‌ కేటగిరీ భద్రత.. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం

AIMIM Chief Asaduddin Owaisi, AIMIM Chief Asaduddin Owaisi Given ‘Z’ Category Security After UP Attack, Bullets fired at Asaduddin Owaisi, Mango News, Shots fired at AIMIM chief Asaduddin Owaisi vehicle, Shots fired at AIMIM chief Asaduddin Owaisi vehicle in UP poll convoy, UP Election, UP Election 2022, up election 2022 total seats up election 2022 opinion poll, up election date, UP Polls, UP Polls 2022, UP Polls Shots Fired at AIMIM Chief Asaduddin Owaisi’s Vehicle, UP Polls Shots Fired at AIMIM Chief Asaduddin Owaisi’s Vehicle Near Chhajarsi Toll Plaza Way to Delhi, uttarakhand election 2022 up election 2022 candidates list

ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి జెడ్‌ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్‌పై నిన్న జరిగిన దాడి నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో నిన్న ఓవైసీ వాహనంపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత అసదుద్దీన్‌ ఓవైసీ భద్రతపై కేంద్ర హోం శాఖ అత్యవసర సమీక్ష నిర్వహించింది. సమీక్ష అనంతరం.. ఓవైసీకి సీఆర్ఫీఎఫ్‌తో జెడ్‌ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇది వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోం శాఖ. జెడ్‌ కేటగిరీ భద్రతలో.. ఒక ఎస్కార్ట్ కారుతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉంటారు. నలుగురు నుంచి ఆరుగురు ఎన్ఎస్జి కమాండోలు, పోలీసులతో సహా 22 మంది సిబ్బంది ఉంటారు.

ఇదిలా ఉండగా.. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తు‍న్నట్లు తెలిసింది. అలాగే, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని ఓవైసీ ఈసీని కోరారు. కాగా, ఈ దాడి వెనుక మాస్టర్‌ మైండ్‌ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తు‍న్నారు ఓవైసీ. మరోవైపు అసదుద్దీన్‌ ఓవైసీ శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బీర్లాను కలవనున్నారు. లోక్‌సభలో కూడా తనపై జరిగిన కాల్పుల ఘటనను వివరించనున్నారు ఓవైసీ. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో  పర్యటిస్తున్న ఓవైసీ కాన్వాయ్‌పై ఛిజారసీ టోల్ గేట్ సమీపంలో నిన్న కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని దుండగులు తమ కాన్వాయ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్వయంగా వెల్లడించారు అసదుద్దీన్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =