యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు

Boris Johnson, COVID-19 situation in India, COVID-19 Surge In India, India Coronavirus, india coronavirus cases, India Coronavirus News, Indian Government, Mango News, Ministry of External Affairs, Prime Minister Boris Johnson, Prime Minister Modi, second COVID-19 worst hit nation, second wave of the Novel Coronavirus, UK PM Boris Johnson Cancels Visit To India, UK PM Boris Johnson Cancels Visit To India Due To COVID-19 Surge In India, UK Prime Minister Boris Johnson

యునైటెడ్ కింగ్ డమ్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. బోరిస్‌ జాన్సన్‌ ఏప్రిల్‌ నెల చివరిలో భారతదేశ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితి కారణంగా ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. కరోనా పరిస్థితి దృష్ట్యా ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వచ్చే వారం భారతదేశానికి రావడంలేదని బ్రిటిష్ మరియు భారత ప్రభుత్వాల తరపున సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇక యూకే మరియు భారత్ మధ్య భవిష్యత్ భాగస్వామ్యం కోసం ప్రణాళికలు, చర్చలకు సంబంధించి ఈ నెల చివర్లో ప్రధాని నరేంద్ర మోదీ మరియు బోరిస్ జాన్సన్ మాట్లాడతారని, అలాగే క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతారుని పేర్కొన్నారు. ఇక ఈ సంవత్సరం తరువాత ఇరు ప్రధానుల వ్యక్తిగత భేటీ కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

ముందుగా 2021 రిపబ్లిక్ వేడుకల సందర్భంలోనే ముఖ్య అథితిగా ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆ సమయంలో యూకేలో కరోనా వ్యాప్తి ప్రభావం ఎక్కువుగా ఉండడంతో ఆయన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అనంతరం ఏప్రిల్‌ నెల చివరిలో భారతదేశ పర్యటనకు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే ఈసారి భారత్ లో కరోనా ప్రభావం పెరుగుతుండడంతో మ‌రోసారి బోరిస్‌ జాన్సన్ ప‌ర్య‌ట‌న రద్దు అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + five =