హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటన కోసం.. నేడు నందమూరి బాలకృష్ణ దీక్ష

Balayya Babu, Hero Nandamuri Balakrishna, Hindupur District Headquarters Issue, Mango News, MLA Nandamuri Balakrishna, MLA Nandamuri Balakrishna decided to sit on Dharna, MLA Nandamuri Balakrishna decided to sit on Dharna in Hindupur district, Nandamuri Balakrishna, Nandamuri Balakrishna To Protest Against Over Hindupur District Headquarters Issue, Nandamuri Balakrishna To Protest Against YSRCP Government, Nandamuri Balakrishna To Protest Against YSRCP Government Over Hindupur District Headquarters Issue, TDP MLA Nandamuri Balakrishna, TDP MLA Nandamuri Balakrishna Conducting Rally in Hindupur Today, YSRCP Government

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు హిందూపురంలో దీక్షకు సిద్దమయ్యారు. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ దీక్షకు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈమధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ స్థానానికో జిల్లా ప్రకారం ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు వైసీపీ తన మానిఫెస్టోలో తెలిపింది. ఈ క్రమంలో.. సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ అయింది. అయితే, జిల్లాల పునర్విభజనను కొందరు వ్యతిరేకిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం జిల్లాల పేర్ల విషయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

దీనిలో భాగంగా.. హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూపురం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ ఆయన మౌన ప్రదర్శన నిర్వహించారు. వైసిపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్‌సభ కేంద్రం ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని బాలకృష్ణ అన్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. అన్ని రంగాల్లో హిందూపురం అభివృద్ధి చెందుతోందని బాలకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు. ఈ సాయంత్రం అఖిలపక్షాల నేతలతో చర్చించిన తర్వాత మలి ఉద్యమ కార్యచరణపై స్పష్టతనివ్వనున్నారు బాలకృష్ణ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here