నేడు ‘ప్రపంచ క్యాన్సర్ డే’.. మహమ్మారిపై పోరులో అవగాహన ముఖ్యం

ఈ రోజు ‘ప్రపంచ క్యాన్సర్ డే’. ప్రతి యేటా ఫిబ్రవరి 4వ తేదీన దీనిని జరుపుకుంటారు. క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన పెంచడం, నివారించటం, సరైన సమయంలో గుర్తించడం, చికిత్స విధానాన్ని తెలుసుకోవడం.. మొదలైనవాటిని ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ డే గా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కొన్ని వేల మరణాలు కేవలం ‘క్యాన్సర్ మహమ్మారి’ వలనే సంభవిస్తున్నాయి. క్యాన్సర్ అనేది ఎవరికి, ఎప్పుడు, ఎలా, ఎందుకు సోకుతుందో చెప్పలేం. కానీ, దీనికి సంబంధించి ఒక నిజం మాత్రం అందరూ తెలుసుకోవాలి.

అది ఏంటంటే.. క్యాన్సర్ వ్యాధి కన్నా.. దాని వలన కలిగే భయమే మనిషిని మరణానికి చేరువ చేస్తుంది. అందుకే క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కొన్ని జాగ్రత్తలు.. సూచనలు ఎప్పటికప్పుడు వైద్య నిపుణులు తెలియజేస్తుంటారు. వ్యాధి ప్రారంభంలో క్యాన్సర్‌ను గుర్తించని కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. ప్రారంభంలోనే క్యాన్సర్ లక్షణాల్ని గుర్తించి సరైన చికిత్స అందిస్తే రోగులు కోలుకోవటానికి అవకాశాలు హెచ్చు అని వైద్య నిపుణుల ఉవాచ. ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా.. ఇలాంటి వాటి వలన పురుషులు క్యాన్సర్ వ్యాధి బారిన పడటానికి ముఖ్య కారణాలుగా డాక్టర్స్ చెప్తున్నారు. కావున మగవాళ్ళు వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండటం మంచిది.

అయితే, చాలావరకు స్త్రీలు వీటికి దూరంగా ఉంటారు. అయినాసరే వారు కూడా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రధానంగా మహిళలు విస్మరించకూడని కొన్ని లక్షణాల్ని వైద్యులు సూచిస్తున్నారు. మహిళల్లో ప్రధానంగా కన్పించేది రొమ్ము క్యాన్సర్. రొమ్ము, చంకలో నొప్పిలేని గడ్డలు ఏర్పడతాయి. చర్మంపై మార్పులొస్తాయి. చనుమొనల్నించి రక్తస్రావం కలుగుతుంది. మహిళలు ఈ మార్పుల్ని విస్మరించకూడదు. ఇక మరోటి.. గర్భాశయ క్యాన్సర్‌. లైంగిక సంపర్కం తరువాత తీవ్ర రక్తస్రావం, పీరియడ్స్ ముగిసిన తరువాత ఎక్కువ బ్లీడింగ్, గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతమే.

ఇంకో ముఖ్యమైనది.. అండాశయ క్యాన్సర్‌.. యోని ఇన్‌ఫెక్షన్ కారణంగా గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, బరువు క్షీణించడం వంటివి అండాశయ క్యాన్సర్‌కు లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే వైద్యుల్ని సంప్రదించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వంటివాటి ద్వారా మహిళల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అందుకే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం గురించి మరింత అవగాహన కల్పించడం ద్వారా మన జీవితాల నుండి క్యాన్సర్‌ని అంతం చేద్దాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − six =