అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తుంది. దేశమంతా ఓ వైపు అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితంపై బిజీగా ఉన్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతుంది. నవంబర్ 5, గురువారం నాడు ఒక్కరోజే అమెరికాలో 1,18,319 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99,19,637 కు చేరుకుంది. అలాగే కరోనా వైరస్ వలన మరణించినవారి సంఖ్య కూడా 2 లక్షల 40 వేలు దాటింది. ఇక 63,40,486 మంది కరోనా నుంచి కోలుకోగా, 33,38,196 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అధికారక సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్ (84,11,724) మరియు బ్రెజిల్(56,14,258) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన దేశాల్లో సైతం అమెరికానే మొదటి స్థానంలో కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ