త్వరలో దేశంలోకి మోడెర్నా కరోనా వ్యాక్సిన్, దిగుమతులు కోసం సిప్లాకు డీసీజీఐ అనుమతి

Cipla Cleared to Import Moderna Vaccine for Emergency Use, Cipla gets DCGI nod to import Moderna COVID-19 vaccine, Cipla to Import Moderna Covid-19 Vaccine, DCGI, DCGI Allowed Cipla to Import Moderna Covid-19 Vaccine, DCGI Allowed Cipla to Import Moderna Covid-19 Vaccine For Restricted Emergency Use In India, Drugs Controller General of India, Govt nod for Cipla to import Moderna’s COVID-19 vaccine, Mango News, Moderna COVID-19 vaccine, Moderna Covid-19 Vaccine For Restricted Emergency Use In India, Moderna Vaccine Import, Moderna’s COVID-19 vaccine gets approval, Moderna’s Covid-19 vaccine gets emergency use nod

దేశంలో త్వరలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడెర్నా యొక్క కరోనా వ్యాక్సిన్‌ దిగుమతులు కోసం ముంబయికి చెందిన ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ముందుగా మోడెర్నా వ్యాక్సిన్ డోసుల దిగుమతి, అమ్మకాల అనుమతుల కోసం సిప్లా సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకోగా, పరిశీలించిన అనంతరం పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. దేశంలో ఇప్పటికే కోవీషీల్డ్‌, కొవాగ్జిన్, స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్స్ ఆమోదం పొందగా, నాలుగవ వ్యాక్సిన్‌ గా మోడెర్నా చేరనుంది.

నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వి.కె పాల్ మాట్లాడుతూ, అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన మొట్టమొదటి వ్యాక్సిన్ అయిన మోడెర్నాకు దేశంలో పరిమితులతో కూడిన వినియోగం కోసం అనుమతి జారీచేయబడిందన్నారు. మోడెర్నా వ్యాక్సిన్ కూడా రెండు డోసులలో ఇవ్వబడుతుందని చెప్పారు. దీంతో దేశంలో నాలుగు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండనున్నాయని, ఫైజర్‌ కరోనా వ్యాక్సిన్ పై కూడా త్వరలోనే ఒప్పందాన్ని పూర్తిచేస్తామని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − two =