కేంద్రానికి కాసుల వర్షం

Increase In Tax Collections,India Increase In Tax Collections,Tax Collection In India,India's Gross Direct Tax Collection,Mango News, Mango News Telugu,India's Net Direct Tax Collection,India's Net Direct Tax Collection Rises,Advance Tax Collections Rise,Direct Tax Collections,Net Direct Tax Collections,India Direct Tax Collections, India Advance Tax Collections, Net Direct Tax Collections Up

కేంద్రానికి కాసుల వర్షం కురిసింది. కార్పొరేట్ల నుంచి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులు ఊహించని విధంగా..అది కూడా గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికే డైరక్ట్ పన్నుల వసూళ్లు ఏకంగా 23.51 శాతం పెరిగి.. రూ.8.65 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

సెప్టెంబర్ 16 నాటికి నికరంగా రూ. 8,65,117 కోట్లు డైరక్టు పన్నుల రూపంలో వసూలయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో సీఐటీ అంటే కార్పొరేట్ ఆదాయ పన్ను రూ. 4,16,217 కోట్లు కాగా.. పీఐటీ అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను , ఎస్‌టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రెండూ కలిపి రూ. 4,47,291 కోట్లు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 16వ తేదీకి నెట్ డైరక్ట్ ట్యాక్స్ వసూళ్లు 23.51 శాతానికి పైగా పెరిగాయని..ఒక ప్రకటనలో ఆర్థిక శాఖ తెలిపింది.

ముందస్తు ట్యాక్స్ వసూళ్లు సెప్టెంబర్ మధ్య వరకు రూ. 3.55 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ చెప్పుకొచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూలు చేసిన రూ.2.94 లక్షల కోట్లతో పోలిస్తే .. ఇవి 21 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సెప్టెంబర్ 16 తేదీకి వసూలైన అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ రూ. 3.55 లక్షల కోట్లతో.. కార్పొరేట్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రూ.2.80 లక్షల కోట్లు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రూ. 74,858 కోట్లు ఉన్నాయి. అలాగే మరోవైపు సెప్టెంబర్ 16 వరకు దాదాపు రూ.1.22 లక్షల కోట్ల రీఫండ్‌లను.. ట్యాక్స్‌ పేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =