2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పీకే జోస్యం

Prashant Kishor, Predicts Clean Sweep, NDA, Lok Sabha Polls, Lok Sabha Elections 2024, Modi, assembly polls, Congress, Congress Political Updates, Chief Minister, BJP, BJP News Updates, BJP News 2024, Mango News Telugu, Mango News
prashant kishor, Lok sabha elections, NDA, Modi

లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఎన్నికలకు గట్టిగా మూడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే ప్రధాన పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల కదనరంగంలోకి దూకేశాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు సరికొత్త ఎత్తుగడలు వేసింది. కానీ తీరా ఎన్నికలు వచ్చే సరికి ఇండియా కూటమికి బీటలువారుతున్నాయి. కూటమి నుంచి నేతలు ఒక్కొక్కరిగా బయటకెళ్తున్నారు.

ఎన్నికలు మంచుకొస్తున్నవేళ ఇండియా కూటమిలో చీలికలు రావడంతో ఎన్డీయే కూటమికి కలిసొస్తోంది. అటు సర్వేలు కూడా మరోసారి ఎర్రకోటపై ఎగిరేది కాషాయపు జెండానేనని తేల్చేశాయి. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నాయి. ఇండియా కూటమి ఈసారి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్డీయే కూటమిని గెలుపును ఆపలేదనే విషయం సర్వేల్లో స్ఫష్టంగా తేలిపోయింది. ఈ సమయంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు  హాట్ టాపిక్‌గా మారాయి.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో గెలవడవ తథ్యమని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ ఇమేజ్ బీజేపీకి బాగా కలిసి వస్తోందని.. గతంలో గెలిచిన సీట్లకంటే ఈసారి ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని వెల్లడించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో గెలుపొందడం బీజేపీకి ప్లస్ అయిందని అన్నారు. అంతేకాకుండా ప్రత్యర్థి ఇండియా కూటమికి బీటలువారడం ఎన్డీయే కూటమికి ఎంతో కలిసొస్తుందని పీకే వెల్లడించారు.

అలాగే ఇటీవల బీహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీతో జత కట్టిన విషయం తెలిసిందే. ఈ పరిణామం లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి కలిసొస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. బీహార్‌లో బీజేపీకే ఎక్కువ ఓట్లు పడుతాయన్నారు. అలాగే ఎన్నికల తర్వాత జేడీయూ-బీజేపీ పార్టీలు విడిపోతాయని పీకే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 8 =