రెండో భర్త వద్దు .. నా పిల్లలే నాకు ముద్దు

Then Pakistan For A Boyfriend Right Now India For Children,Pakistan Girl Enters India,Pakistani Girl In India,Pakistani Woman For Children,Mango News, Mango News Telugu,Pakistani Woman Entered India,Pak Woman India Life,Anju-Nasrullah Love Story,Indian Woman Anjus Video,Anju-Nasrullah Love Story,Indian Woman Anju Missing Children,Anju Celebrates Pakistan's Independence,Indian Girl Anju Becomes Fatima

ఈ మధ్య ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్‌ల ప్రేమలు, పెళ్లిళ్ల గురించి ఎక్కవగా వింటున్నాం. మొన్నటికి మొన్న పాకిస్తాన్ నుంచి ఓ యువతి, బంగ్లాదేశ్ నుంచి ఓ యువతి ప్రేమించిన యువకుడి కోసం ఇండియా రావడం తెలిసిందే. అయితే వీరికి పెళ్లి అయిన తర్వాత కూడా ప్రేమించిన యువకుడి కోసం భారత్ వచ్చేసారు. కాకపోతే ఇప్పుడుఇండియా నుంచి ప్రేమించిన యువకుడి కోసం పాకిస్తాన్ వెళ్లిపోయిన మహిళ.. ఇప్పుడు మళ్లీ ఇండియా రాబోతోంది.

2019లో భారతీయ మహిళ అంజు, నస్రుల్లా ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారు.అలా ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడు కోసం అప్పటికే పిల్లలున్న అంజు.. తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది అంజు. ఈ ఏడాది జులై 25న ఇస్లాంలోకి మారిన తర్వాత అంజు తన 29 ఏళ్ల స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది.అతనితో కలిసి ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని అప్పర్ దిర్ జిల్లాలో ప్రస్తుతం ఉంటుంది. పెళ్లి తర్వాత మతం మార్చుకున్న అంజు.. పేరు కూడా మార్చుకుని ఇప్పుడు ఫాతిమాగా మారింది. అయితే భారతీయ మహిళ అంజు.. తన పిల్లలను కలవడానికి వచ్చే నెలలో పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆమె పాకిస్థాన్ భర్త నస్రుల్లా తెలిపారు.

ఫాతిమా మానసిక ఆరోగ్యం క్షీణించడం తనకు ఇష్టం లేదని అందుకే ..ఆమె తన పిల్లలను కలవడానికి భారత్‌కు వెళ్లడమే మంచిదని అనుకోవడంతో.. ఆమె భర్త నస్రుల్లా భారత్ పంపిస్తున్నట్లు చెప్పాడు . పాకిస్థాన్‌లో చేయాల్సిన డాక్యుమెంటరీ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత..వీసా రాగానే అంజు తిరిగి భారత్ కు వస్తుందని తెలిపాడు. ఫాతిమా వచ్చే నెలలో భారతదేశానికి తిరిగి వస్తోందని నస్రుల్లా చెప్పాడు. పిల్లల కోసం బెంగపెట్టుకున్న అంజు మానసిక క్షోభకు గురైందని తన పిల్లలను మిస్సవుతుందని , వెనక్కి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని అనుకోవడం వల్ల ఈ నిర్ణయం తప్పడం లేదని ఆమె భర్త అంటున్నారు.

రాజస్థాన్ నివాసి అయిన అరవింద్‌తో అంజు మొదటి వివాహం అయ్యింది. వీరిద్దరికీ 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.అయితే 2019లో పాకిస్తాన్ వాసి నస్రుల్లాతో పరిచయం ఏర్పడి.. పిల్లలను వదలి వెళ్లిపోయింది. పెళ్లి తర్వాత అంజు, ఆమె భర్త పెషావర్‌లో ఉంటున్నారు. కానీ ఇప్పుడు పిల్లల కోసం మళ్లీ ఇండియా వచ్చేస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here