ఇండియాలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్‌.. ఢిల్లీలో నేడు ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్

Apple CEO Tim Cook Welcomes Customers During Opens The First Store in Delhi and Second One in India Today,Apple CEO Tim Cook Welcomes Customers,Tim Cook Welcomes First Store in Delhi,CEO Tim Cook Second One in India Today,Mango News,Mango News Telugu,Apple Saket Store,Apple store opens in Delhi’s Saket,Apple Delhi store launch,Apple Store Opening Delhi Live,Apple loyalists Meet CEO Tim Cook,Tim Cook opens doors to India's 2nd Apple store,India's Second Apple Store Opens,Apple Saket Store Latest News,Apple Saket Store Latest Updates

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన రెండో ఔట్‌లెట్‌ (రిటైల్‌ స్టోర్‌)ను ఓపెన్ చేసింది. గురువారం ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను సంస్థ సీఈఓ టిమ్ కుక్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా స్టోర్ డోర్స్ ఓపెన్ చేసి కస్టమర్లను ఆహ్వానించడం విశేషం. దీనిని ‘యాపిల్ సాకెట్’ స్టోర్‌గా సంభోదిస్తున్నారు. ఇక అంతకుముందు యాపిల్ సాకెట్ లోని ఉద్యోగులతో కలిసి ఆయన సెల్ఫీలు దిగారు. కాగా యాపిల్, రెండు రోజుల క్రితం (ఏప్రిల్ 18న) భారతదేశంలో తన మొట్ట మొదటి ఔట్‌లెట్‌ (రిటైల్‌ స్టోర్‌)ను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను ప్రారంభించారు. మరోవైపు కొనుగోలు కోసం వినియోగదారులు ఉదయం నుంచే ఎండను సైతం లెక్క చేయక క్యూ లైన్లలో నిలబడి వేచి చూస్తుండటం గమనార్హం. కాగా దీనిని ‘యాపిల్ సాకెట్’ స్టోర్‌గా వ్యవహరిస్తుండగా.. ముంబైలోని రిటైల్‌ స్టోర్‌ను ‘యాపిల్‌ బీకేసీ’గా సంభోదిస్తున్నారు.

ఈ కార్యక్రమాల కోసం టిమ్ కుక్ సోమవారం ఇండియాకు చేరుకున్నారు. కాగా ఢిల్లీ సాకెట్‌లోని సెలెక్ట్‌ సిటీవాక్‌ మాల్‌లో ఈ ఉదయం 10 గంటలకు యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై ఢిల్లీ సాకేట్‌ లోగోను ఆ రాష్ట్ర సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. అలాగే ముంబైలో ప్రారంభించిన యాపిల్‌ స్టోర్‌ మాదిరిగానే ఢిల్లీ రిటైల్‌ స్టోర్‌ సైతం దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ముంబైలోని యాపిల్ బీకేసీ రీటైల్‌ స్టోర్‌ దాదాపు 22,000 చదరపు విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. లాస్‌ఎంజెల్స్‌, న్యూయార్క్‌, బీజింగ్‌, మిలాన్‌, సింగ్‌పూర్‌ వంటి నగరాల తర్వాత ముంబైలోనే యాపిల్‌ ఐ-ఫోన్‌ రిటైల్‌ స్టోర్‌ ఏర్పాటు కానుండటం గమనార్హం. ఇక యాపిల్ బీకేసీ లోగోను ముంబై ఐకానిక్ ఆర్ట్ అయిన ‘కాలీపీలి టాక్సీ ఆర్ట్’తో రూపొందించారు. ఇండియాలో వ్యాపార విస్తరణలో భాగంగా.. ఇప్పటికే చైనాలో ఉన్న తయారీ యూనిట్‌ను భారత్‌కు తరలిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − four =