కరోనా పై రాష్ట్రాలకు మళ్ళీ కొత్త మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Mango News, telangana corona district wise cases, Telangana Corona Updates, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో, కరోనాను సమర్ధవంతంగా అరికట్టడానికి చేపట్టవలసిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దేశంలో తాజాగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలలో టెస్టింగ్-ట్రేసింగ్‌-ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలను పాటించేలా చూడాలని, అలాగే దేశంలో అనుమతి ఇచ్చిన ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలని సూచించారు.

ఇక కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించడం సహా జోన్లలో నిర్దేశించిన నియంత్రణ చర్యలును కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. మరోవైపు దేశంలో అనుమతించబడిన వివిధ కార్యకలాపాలకు సంబంధించి గ‌తంలో సూచించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ (ఎస్ఓపీలు) తప్పనిసరిగా, కఠినంగా పాటించడంపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు దృష్టి కేంద్రీకరించి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు.

కరోనాపై కేంద్రం జారీచేసిన కొత్త మార్గదర్శకాలు:

  • కరోనా నిర్ధారణ భాగంగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయడంలో వెనుకబడివున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు వెంటనే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను వేగవంతం చేసి నిర్ణీత 70 శాతం లేదా అంతకు మించి పరీక్షలు జరిగేలా చూడాలి.
  • విస్తృత పరీక్షల్లో బయటపడే కొత్త పాజిటివ్ కేసులను ఐసొలేషన్/క్వారంటైన్ లో ఉంచి తక్షణమే చికిత్స అందించాలి
  • అలాగే నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ గా తేలిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా గుర్తించి, వారిని కూడా వారిని కూడా ఐసొలేషన్/క్వారంటైన్ లో ఉంచాలి.
  • నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని హోం, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికారులు సూక్ష్మ స్థాయిలో కంటైన్మెంట్ జోన్లను గుర్తించాలి.
  • ఈ కంటైన్మెంట్ జోన్లను సంబంధిత జిల్లా కలెక్టర్లు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ వెబ్ సైట్లలో నోటిఫై చేయాలి. అలాగే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు కూడా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలి.
  • కంటైన్మెంట్ జోన్స్ గా ప్రకటించిన ప్రాంతాల్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్ ప్రాంత పరిధిని గుర్తించి, ఈ పరిధిలో ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టి పరీక్షలు చేయడం, కరోనా సోకినవారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించడం, ఐఎల్ఐ/శ్వాసకోశ కేసులను గుర్తించడం లాంటి చర్యలను అమలు చేయాలి.
  • స్థానిక జిల్లా, పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు కంటైన్మెంట్ నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. ఈ అంశంలో అధికారులు జవాబుదారీతనంతో పనిచేసేలా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలి.
  • కార్యాలయాలు, బహిరంగా ప్రదేశాలు, ముఖ్యంగా రద్దీగా వుండే ప్రదేశాల్లో కరోనా నిబంధనలు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలను అమలు చేయాలి.
  • ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకొనేలా చూడడం, సామాజిక దూరం పాటించేలా చూడడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రజలు నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధించడంతో పాటుగా ఇతర రకాల చర్యలను రాష్ట్రాలు అమలు చేయొచ్చు.
  • కరోనాపై జారీఅయిన మార్గదర్శకాలు దేశమంతటా అమలులో ఉంటాయి.
  • కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పరిస్థితికి అనుగుణంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లా/నగర/వార్డు స్థాయిలో స్థానికంగా ఆంక్షలను విధించవచ్చు.
  • రాష్ట్రం లోపలగాని, రాష్ట్రాల మధ్య గాని వ్యక్తుల రాకపోకలకు, సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలూ ఉండవు. విదేశీ సరకు రవాణాకు కూడా ఈ సడలింపు అమలులో ఉంటుంది. ఎలాంటి ప్రత్యేకమైన అనుమతులు గాని, ఈ-పాస్ లు గాని అవసరం లేదు.
  • కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు సూచించిన నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతాయి. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ, విమాన ప్రయాణాలు, మెట్రో రైళ్ల నిర్వహణ, పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, వినోద పార్కులు, యోగా కేంద్రాలు, వ్యాయామశాలలు, ఎగ్జిబిషన్స్, సమావేశాలు మరియు సమ్మేళనాలు వంటి కార్యకలాపాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ (ఎస్ఓపీలు) ఆధారంగా అమల్లో ఉంటాయి. అయితే వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు సవరించే మార్గదర్శకాలను సంబంధిత అధికారులు తప్పనిసరిగా అమలు చేయవలసి ఉంటుంది.
  • కరోనా కట్టడికి ప్రపంచంలో అతి పెద్ద వాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. కరోనా వాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆశించినంత వేగంగా జరగడం లేదు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి వాక్సినేషన్ అత్యంత అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాక్సినేషన్ కార్యక్రమ వేగాన్నిపెంచి అర్హులైన ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =