సాక‌ర్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ సంచలన నిర్ణయం.. ఖ‌త‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఫిఫా వరల్డ్ కప్ తర్వాత కెరీర్‌కు గుడ్ బై

Argentina Soccer Legend Lionel Messi Confirms Qatar World Cup will be His Last Tournament in Career, Argentina Soccer Legend Lionel Messi, Lionel Messi Retirement, Qatar World Cup Lionel Messi Last Tournament, Qatar World Cup, Mango News, Mango News Telugu, Lionel Messi Qatar World Cup Will Be His Last, Messi Confirms Qatar World Cup Will Be His Last, Lionel Messi World Cup, Lionel Messi Qatar World Cup, Lionel Messi Latest News And Updates, Qatar World Cup Live Updates

అర్జెంటీనా సాక‌ర్ దిగ్గ‌జం లియోనల్ మెస్సీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. వ‌చ్చే నెల‌లో ఖ‌త‌ర్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 తనకు చివ‌రిద‌ని తెలిపాడు. దీంతో త‌న రిటైర్‌మెంట్ గురించి మెస్సీ స్పష్టం చేసినట్లైంది. కాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెస్సీ మాట్లాడుతూ.. తాను వరల్డ్ కప్‌కు రోజులు లెక్కపెడుతున్నానని, ఈ సందర్భంగా కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్నందుకు తీవ్ర ఆందోళన, ఒత్తిడి ఫీలవుతున్నట్టు చెప్పాడు. ఇక వరల్డ్ కప్‌లో ఏమైనా జరగొచ్చుని, ప్రతీ మ్యాచ్‌ చాలా కఠినంగా ఉందబోతోందని పేర్కొన్నాడు. ఫేవరెట్లుగా బ‌రిలోకి దిగినంత మాత్ర‌న విజ‌యం సొంతం అవుతుంద‌న్న గ్యారెంటీ ఏమీ లేద‌న్న మెస్సీ, ఇప్పుడున్న ప‌రిస్థితిని బ‌ట్టి అర్జెంటీనా టైటిల్ రేసులో ముందుండే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

కాగా లియోనెల్ మెస్సీ ఇప్పటివరకు 2006, 2010, 2014, 2018 వరల్డ్ కప్‌లలో ఆడాడు. అయితే ఈ అర్జెంటీనా స్టార్ వరల్డ్ కప్‌లో పెద్దగా రాణించలేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు ఆడిన అన్ని వరల్డ్ కప్‌ల్లోని మొత్తం 19 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు గోల్స్ మాత్రమే చేశాడు. కానీ అర్జెంటీనా జట్టు మాత్రం ప్రస్తుతం అత్యుత్తమ స్థాయిలో ఆడుతోంది. 2021 కోపా అమెరికా ఫైనల్‌లో ఆతిథ్య బ్రెజిల్‌పై విజయం సాధించిన అర్జెంటీనా, గ‌త 35 మ్యాచుల్లో ఒక్క‌సారి కూడా ఓటమి లేకుండా సాగడం విశేషం. ఇదిలా ఉండగా మరోవైపు లియోనెల్ మెస్సీ రిటైర్‌మెంట్ ప్రకటనతో అర్జెంటీనా ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =