ఆసియా కప్-2022 కు భారత్ జట్టు ప్రకటన, జట్టులోకి విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌ పునరాగమనం

BCCI Announced India’s Squad for Asia Cup 2022, India’s Squad for Asia Cup 2022, Asia Cup 2022, 2022 Asia Cup, Asia Cup, India Squad For 2022 Asia Cup Announced, KL Rahul Returns As The Vice-Captain, Rohit Sharma named As captain, Asia CUP India Squad, All-India Senior Selection Committee has picked India's squad for the upcoming Asia Cup 2022, India's squad for the upcoming Asia Cup 2022, All-India Senior Selection Committee, Board of Control for Cricket in India, Asia Cup 2022 News, Asia Cup 2022 Latest News, Asia Cup 2022 Latest Updates, Asia Cup 2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఇటీవలే ఆసియా కప్-2022 షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. యూఏఈ లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ కోసం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన భారత్ జట్టును ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. భారత్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గత వెస్టిండీస్‌ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లి మరియు గాయాలు, కోవిడ్ కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి చేరారు. కాగా జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల కారణంగా ఎంపికకు అందుబాటులో లేరని, వారు ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో రీహాబిలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. అలాగే గాయం నుంచి కోలుకున్న దీపక్‌ చాహర్‌, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ లను స్టాండ్‌బైలుగా నియమించారు.

యూఏఈలో జరగనున్న ఆసియా కప్ 15వ ఎడిషన్ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు ఆసియా నుంచి మరో క్వాలిఫయర్‌ జట్టు తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్‌, అత్యంత విజయవంతమైన జట్టుగా ఏడుసార్లు ఈ ట్రోఫీని గెలుచుకుంది. కాగా టోర్నీ చివరి ఎడిషన్ వన్డే ఫార్మాట్‌లో జరగగా, ఈసారి ఎడిషన్ టీ20 ఫార్మాట్‌లో ఉండనుంది. ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్థాన్‌, క్వాలిఫైయింగ్ జట్లు ఉండగా, గ్రూప్‌-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘానిస్థాన్‌ జట్లు ఉన్నాయి. కాగా చాలాకాలం తరువాత భారత్, పాకిస్తాన్ జట్లు ఆసియా కప్‌ లో తలపడనున్నాయి. దాయాదుల మధ్య పోరు దుబాయి వేదికగా ఆగస్టు 28న జరగనుంది.

యూఏఈలోని దుబాయ్ మరియు షార్జా వేదికల్లోనే ఈ టోర్నీ యొక్క మొత్తం 13 మ్యాచ్‌ లు జరగనున్నాయి. షార్జాలో మూడు మ్యాచ్‌, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 10 మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతి జట్టు గ్రూప్ దశలో మరొకదానితో ఒకసారి ఆడుతుంది, ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ 4 రౌండ్ కి వెళ్లనున్నాయి. సూపర్ 4లో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ముందుగా ఆసియా కప్-2022 శ్రీలంక వేదికగా నిర్వహించాల్సి ఉండగా, ఆ దేశంలో తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వేదికను యూఏఈకి మార్చారు.

ఆసియా కప్‌లో పాల్గొనే భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్.

స్టాండ్‌బై ప్లేయర్స్: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్‌.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =