బీసీసీఐ సంచలన నిర్ణయం, ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు

BCCI announces that The Match Fee for Both Men and Women Cricketers will be Same, BCCI Match Fee Equity, BCCI Fee Equity for Both Men and Women, Men and Women Cricketers Same For Both, Mango News,Mango News Telugu, BCCI Introduced Equal Pay, Equal Match Fee For Men And Women Cricketers, BCCI Announces Equal Match Fee, Pay Equity, Indian Women Cricketers, India Men Women Cricketers, BCCI Introduces Pay Equity Policy

భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పురుషులు/మెన్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు అందించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సరికొత్త పే ఈక్విటీ విధానాన్ని బీసీసీఐ అమలు చేయనుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా గురువారం ట్విట్టర్ వేదికగా మహిళా క్రికెటర్లకు వేతనాలపై ప్రకటన చేశారు. “వివక్షను అధిగమించే దిశగా బీసీసీఐ తొలి అడుగు వేసినందుకు నేను సంతోషిస్తున్నాను. మేము మా కాంట్రాక్ట్ బీసీసీఐ మహిళా క్రికెటర్లకు పే ఈక్విటీ విధానాన్ని అమలు చేస్తున్నాము. మేము భారతీయ క్రికెట్‌లో లింగ సమానత్వం యొక్క కొత్త యుగానికి నాంది పలుకుతున్నాం. ఇకపై పురుషులు మరియు మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు సమానంగా ఉంటుంది” అని జైషా తెలిపారు.

“బీసీసీఐ మహిళా క్రికెటర్లకు వారి తోటి మెన్ క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లించబడుతుంది. టెస్టుల్లో మ్యాచ్ కు రూ.15 లక్షలు, వన్డేల్లో రూ.6 లక్షలు, టీ20ల్లో రూ.3 లక్షలు చెల్లిస్తాం. బీసీసీఐ మహిళా క్రికెటర్లకు ఈక్విటీ చెల్లించడం నా నిబద్ధత మరియు అందుకు మద్దతు తెలిపిన అపెక్స్ కౌన్సిల్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని బీసీసీఐ సెక్రటీరీ జైషా ట్వీట్​ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here