జియోఫోన్‌ నెక్స్ట్‌ సెప్టెంబరు 10 నుంచి అందుబాటులోకి, ముకేశ్ అంబానీ ప్రకటన

Ambani Announces JioPhone Next, JioPhone Next to 5G, Jiophone Next To Be Launched On Sep 10, JioPhone Next to Sell From Sep 10, JioPhone Next With Optimised Android, Mango News, Mukesh Ambani, Mukesh Ambani Announces JioPhone Next, Mukesh Ambani Announces JioPhone Next will be Available from SEP 10th, Mukesh Ambani announces smartphone in partnership, Reliance AGM 2021, Reliance Agm Highlights, Reliance Jio, Ril Agm, RIL AGM 2021, RIL AGM 2021 Live Updates, RIL to launch JioPhone Next in September

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జూలై 24, గురువారం నాడు జరిగింది. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. రిలయన్స్‌ మరియు గూగుల్‌ భాగస్వామ్యంతో జియోఫోన్‌ నెక్స్ట్‌ను అభివృద్ధి చేశామని వెల్లడించారు. సెప్టెంబర్ 10న వినాయకచవితి సందర్భంగా జియోఫోన్‌ నెక్స్ట్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జియోఫోన్ నెక్స్ట్ ను గూగుల్ మరియు జియో రెండింటి యొక్క మొత్తం యాప్స్ కు మద్దతు ఇచ్చే విధంగా పూర్తి స్థాయి ఫీచర్ స్మార్ట్‌ఫోన్ గా రూపొందించినట్టు చెప్పారు. జియో మరియు గూగుల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ యొక్క ఆప్టిమైజ్ వెర్షన్ ఆధారంగా పనిచేస్తుందన్నారు. జియోఫోన్ నెక్స్ట్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువధరకు లభించే స్మార్ట్‌ఫోన్లలో ఒకటి నిలుస్తుందని ముకేశ్ అంబానీ వెల్లడించారు.

ఈ సమావేశంలో సౌదీ అరామ్‌కోను వ్యూహాత్మక భాగస్వామిగా ముకేశ్ అంబానీ స్వాగతం పలికారు. రిలయన్స్ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ ఆరామ్‌కో ఛైర్మన్‌ యాసిర్‌ అల్‌ రుమయాన్‌ రిలయన్స్‌ బోర్డులోకి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా చేర్చినట్టు తెలిపారు. అలాగే 2016 లో జియోను ప్రారంభించి డిజిటల్ రంగంలో కీలక మార్పులు తెచ్చామని, 2021 లో దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ విభజనను తగ్గించే లక్ష్యంతో న్యూ ఎనర్జీ బిజినెస్ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. రూ.60,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నామన్నారు. ఇందుకోసం రిలయన్స్ న్యూ ఎనర్జీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసామని, రిలయన్స్ 100 జీడబ్య్లు సౌర శక్తిని ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. మరోవైపు కరోనా సమయంలో ఉద్యోగాలను కాపాడటమే కాకుండా కొత్తగా 65,000 ఉద్యోగాలను రిలయన్స్ సృష్టించిందని ముఖేశ్‌ అంబానీ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − one =