భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

500 Crores to Armed Forces, 500 Crores to Armed Forces to Buy Weapon Systems, Centre Grants Rs 500 Crores to Armed Forces, Defence Minister, Defence Minister Rajnath Singh, India China border clash, India-China Border Clash News, India-China Border Issue, India-China Clashes, Rajnath Singh

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకున్న నేపధ్యంలో జూన్ 21, ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుధ వ్యవస్థ పెంచడం, నూతన, అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయడం వంటి అంశాలకు సంబంధించి అత్యవసరాల నిమిత్తం రూ.500 కోట్లు లోపు ఖర్చు చేసేందుకు భారత త్రివిధ దళాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సైనిక వ్యవహారాల విభాగంతో సంప్రదించి, అత్యవసర ప్రాతిపదికన త్రివిధ దళాలు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చని కేంద్రం పేర్కొంది

మరోవైపు భారత్-చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ‌బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులు‌ ఎం.ఎం.నరవణె, ఆర్‌.కె.ఎస్‌ భదౌరియా,‌ కరంబీర్‌ సింగ్‌ ఈ సమీక్షలో పాల్గొన్నారు. చైనా సరిహద్దుల వెంబడి విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు ఇకపై పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అలాగే సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించడంపై క్షేత్రస్థాయి కమాండర్లు నిర్ణయం తీసుకునేలా అనుమతించినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =