వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును నేడు ప్రారంభించడం నా అదృష్టం – సీఎం జగన్

CM Jagan Inaugurates The Third Unit of APGENCO Thermal Power Station at Nellore Today, AP CM YS Jagan Mohan Reddy, Genco Thermal Plant Opening, Genco Thermal Plant in Muthukur, Mango News, Mango News Telugu, Genco Thermal Plant Nellore, Nellore Genco Thermal Plant, Jagan To Launches 3rd Unit of Genco Thermal Plant, Nellore Thermal Plant Opening Nellore, Nellore Thermal Plant Opening, Genco Thermal Plant Latest News And Updates, 3rd Unit of Genco Thermal Plant, Nellore Thermal Plant

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలత్తూరులో ఏపీజెన్‌కో మూడో యూనిట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే దీనికిముందు కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులకు చేపల వేటకు అనువుగా రూ. 25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్‌ను నేడు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, దీనిని జాతికి అంకితం చేస్తున్నామని ప్రకటించారు. అలాగే దీనికి తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టారని, అలాంటిది ఇప్పుడు తన చేతులతో ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణపట్నంలోని శ్రీ పొట్టి శ్రీరాములు శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో యుద్ధ ప్రాతిపదికన 800 మెగావాట్ల యూనిట్‌ను సిద్ధం చేసినట్లు సీఎం ప్రకటించారు. నెల్లూరు జిల్లా. ప్రభుత్వ రంగంలోనే మొదటిదైన ఈ సూపర్ క్రిటికల్ యూనిట్ ద్వారా రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, సాంప్రదాయ థర్మల్ పవర్ ప్లాంట్లతో పోలిస్తే ఈ ప్లాంట్ తక్కువ బొగ్గును వినియోగిస్తుందని తెలిపారు. ఇది పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తుందని, అలాగే రోజుకు 9,312 టన్నుల బొగ్గుతో పనిచేసేలా యూనిట్‌ను రూపొందించారని సీఎం జగన్ వివరించారు.

అంతకుముందు తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలత్తూరుకు సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు బయలుదేరి వెళ్లారు. ఇక ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here